TG TET Results 2026 : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అప్డేట్ - ఫిబ్రవరిలో ఫలితాలు
తెలంగాణ టెట్ - 2026 పరీక్షలు కొనసాగుతున్నాయి. జనవరి 20వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. అయితే ఇందుకు సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి.
తెలంగాణ టెట్ - 2026 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈసారి మొత్తం 2.37 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పలు సబ్జెక్టులు పూర్తి కాగా…. జనవరి 20వ తేదీతో అన్ని పేపర్లు పూర్తవుతాయి.

టీజీ టెట్ పరీక్షల కోసం మొత్తం 18 జిల్లాల్లో 97 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన చర్యలు చేపట్టారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు. వీరంతా కూడా పరీక్షలకు హాజరవుతున్నారు.
టీజీ టెట్ - 2026 ఫలితాలు ఎప్పుడంటే..?
జనవరి 20వ తేదీతో టెట్ పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత ప్రాథమిక కీలు అందుబాటులోకి వస్తాయి. వీటిపై అభ్యంతరాలను పరిశీలిస్తారు. అయితే విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. టీజీ టెట్ - 2026 ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య అందుబాటులోకి వస్తాయి.
ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?
- టీజీ టెట్ - 2026 అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని టీజీ టెట్ జనవరి - 2026 ఫలితాలపై క్లిక్ చేయాలి.
- అభ్యర్థి హాల్ టికెట్, పేపర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ టెట్ స్కోర్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

