మహిళలకు బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో ఫ్రీ ట్రైనింగ్.. 100 శాతం జాబ్ ప్లేస్‌మెంట్
మహిళలకు బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాదు లైసెన్స్ జారీలో సహాయం కూడా చేయనున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు.
హైదరాబాద్ సీపీ సజ్జనర్ తన ఎక్స్ ఖాతాలో మహిళలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. అది ఏంటంటే.. మహిళలకు ఉచితంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. బైక్ టాక్సీ, ఈ-ఆటో నడపాలనుకునే మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. మహిళలకు ఉపాధి లక్ష్యంగా ఈ ట్రైనింగ్ ఉంటుంది.
మహిళలకు డ్రైవింగ్ శిక్షణ
{{^htLoading}} {{/htLoading}}
స్టీరింగ్ పట్టండి.. స్వశక్తితో ఎదగండి అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.
ఉచిత డ్రైవింగ్ శిక్షణ, లైసెన్స్ జారీలో సహాయం.
డ్రైవింగ్ అనుభవం లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
వాహన లోన్/ లీజు సౌకర్యం, ఉపాధి కల్పనకు అవకాశం ఉంటుంది.
వయస్సు: 21–45 ఏళ్లు (హైదరాబాద్ వాసులై ఉండాలి)
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC), అంబర్‌పేట్, హైదరాబాద్‌లో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. జనవరి 3 (శుక్రవారం) ఉదయం 10.30 నుంచి 1 గంట వరకు హాజరుకావాలి. ఇందుకోసం 8978862299 నెంబర్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవాలి. ఆసక్తి గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సజ్జనార్ కోరారు. ఈ సమాచారాన్ని నలుగురికీ తెలిసేలా షేర్ చేయాలన్నారు.
జాబ్ మేళా ఆఫర్లో భాగంగా బైక్, స్కూటర్, ఈ ఆటో ట్రైనింగ్ ఉచితంగా ఉంటుంది. లేడీ ట్రైనర్స్, జాబ్ స్కిల్స్, సేఫ్టీ ట్రైనింగ్ అని ప్రకటనలో తెలిపారు. శిక్షణ అయిపోయిన తర్వాత లైసెన్స్ తీసుకోవడానికి సాయం చేస్తారు. 100 శాతం జాబ్ ప్లేస్‌మెంట్ ఉంటుందన్నారు.
{{^htLoading}} {{/htLoading}}
{{^usCountry}}
21 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న మహిళలు అర్హులు. ఆధార్ కార్డు ఉండాలి. గతంలో డ్రైవింగ్ అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే.. తీసుకురావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
{{/usCountry}}
{{#usCountry}}
21 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న మహిళలు అర్హులు. ఆధార్ కార్డు ఉండాలి. గతంలో డ్రైవింగ్ అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే.. తీసుకురావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.