...
...
Next Story

TGPSC Recruitment Update : డిగ్రీ అర్హతతో 102 ప్రభుత్వ ఉద్యోగాలు - దరఖాస్తులు ప్రారంభం!

తెలంగాణ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ శాఖలో 102 MPSO, ASO పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. నవంబర్ 7వ తేదీ వరకు గడువు ఉంటుంది.

Published on: Oct 31, 2026, 09:50:40 IST
Advertisement

రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. నవంబర్ 27, 2026 దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్షను 2027 జనవరిలో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

102 ఉద్యోగ ఖాళీలు…

టీజీపీఎస్సీ
టీజీపీఎస్సీ

ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 01 జులై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. జోన్ల వారీగా పోస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • జోన్-1 (కాళేశ్వరం) పోస్టుల సంఖ్య: 12
  • జోన్-2 (బాసర) పోస్టుల సంఖ్య: 14
  • జోన్-3 (రాజన్న) పోస్టుల సంఖ్య: 15
  • జోన్-4 (భద్రాద్రి) పోస్టుల సంఖ్య: 17
  • జోన్-5 (యాదాద్రి) పోస్టుల సంఖ్య: 7
  • జోన్-6 (చార్మినార్) పోస్టుల సంఖ్య: 25
  • జోన్-7 (జోగులాంబ) పోస్టుల సంఖ్య: 12

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి కింది విద్యార్హతలలో ఏదైనా ఒక డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు. ప్రధాన సబ్జెక్టుగా స్టాటిస్టిక్స్ (Statistics)తో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండి, అందులో కనీసం ఒక సంవత్సరం లేదా రెండు/మూడు సంవత్సరాలు స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా చదివి ఉండాలి. ఎకనామిక్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండి, అందులో స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా చదివి ఉండాలి. కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా చదువుతూ అందులో స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌ కలిగి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ప్రధాన సబ్జెక్టుగా ఉండి, స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా అర్హులే.

దరఖాస్తులు ప్రారంభం - ప్రాసెస్ ఇలా

  • అర్హత కలిగిన అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్‌సైట్ ( https://www.tgpsc.gov.in )లోకి వెళ్లాలి.
  • దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందే అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌లో 'వన్ టైమ్ రిజిస్ట్రేషన్' (OTR) ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి.
  • హోం పేజీలోని అప్లికేషన్ ఫర్ MPSO/ ASO లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ టీజీపీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు ఓటీపీ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీకు దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పూర్తి వివరాలను నమోదు చేయాలి.
  • చివరగా సబ్మిట్ చేస్తే మీ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks