TGPSC Hall Tickets : పీసీబీ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలు - హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి సీబీఆర్టీ పరీక్ష హాల్టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు అక్టోబర్ 23 సాయంత్రం 5 గంటలలోపు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది.

ఈనెల 24వ తేదీన పరీక్ష…
కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ పరీక్షను (CBRT) అక్టోబర్ 24వ తేదీన టీజీపీఎస్సీ నిర్వహించనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ స్పష్టం చేసింది.
పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ( https://www.tgpsc.gov.in/ ) ద్వారా తమ వివరాలను నమోదు చేసి హాల్టికెట్ కాపీని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు ముందుగానే హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా…
- ముందుగా https://www.tgpsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని డౌన్లోడ్ హాల్ టికెట్ అసిస్టెంట్ సైంటిస్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ టీజీపీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలియ
- మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

