TGPSC Seed Certification Office Recruitment 2026 : వ్యవసాయ శాఖలో కీలకమైన సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ (విత్తన ధృవీకరణ అధికారి) పోస్టుల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

రాష్ట్ర స్థాయి కేడర్‌లో జనరల్ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 19 విత్తన ధృవీకరణ అధికారి ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కమిషన్ ఆగస్టు 12, 2026 వరకు గడువు ఇచ్చింది.
విద్యా అర్హతలు…
ఈ పోస్టులకు పోటీ పడాలనుకునే అభ్యర్థులు నిర్దేశిత విద్యా అర్హతలను కలిగి ఉండటం తప్పనిసరి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి అభ్యర్థులు అగ్రికల్చర్‌లో బేసిక్ డిగ్రీ (B.Sc. Agriculture) పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ వంటి విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎం.ఎస్సీ (M.Sc. Ag.) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థుల వయస్సు జూలై 1, 2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయస్సు 44 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికయ్యే అధికారులకు నెలకు రూ. 51,320 నుండి రూ. 1,27,310 వరకు వేతన శ్రేణి లభిస్తుంది.
అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, సాంకేతిక ఇబ్బందులను నివారించేందుకు వీలైనంత త్వరగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
దరఖాస్తు విధానం
- అభ్యర్థులు ముందుగా https://www.tgpsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- మీ వివరాలను నమోదు చేసి OTR పూర్తి చేయాలి. (ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఉంటే, డైరెక్ట్‌గా లాగిన్ అవ్వవచ్చు).
- దరఖాస్తు చేసుకునేందుకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
- ఫీజు చెల్లించిన తర్వాత…మీ అర్హతలకు తగ్గట్టుగా ఫారం పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
- దీంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఈ ఫీజు రూ. 500 గా నిర్ణయించారు. దీనితో పాటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అభ్యర్థులందరూ అదనంగా రూ. 120 పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థులకు మాత్రం ఈ రూ. 120 పరీక్ష రుసుము నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.