TGSPDCL : ఇంటిపై కప్పుపై సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోండి.. సబ్సిడీ ఎంతంటే?
తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(TGSPDCL), గృహ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటానికి తమ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన(PMSGMBY) పథకం కింద 3 kW సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.78,000 వరకు సబ్సిడీని అందిస్తోందని సదరన్ డిస్కామ్ అధికారులు తెలిపారు. సౌరశక్తి వినియోగాన్ని పెంచడం ద్వారా ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, వినియోగదారులు తమ విద్యుత్ బిల్లులను తగ్గించుకునే అవకాశం కలుగుతుంది.

అర్హులైన గృహ వినియోగదారులు 3 kWp సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంటే గరిష్టంగా రూ.78,000 కేంద్ర సబ్సిడీని పొందవచ్చని అధికారులు వివరించారు. ఇందులో మొదటి 2 kWp సామర్థ్యానికి kWకు రూ.30,000 చొప్పున, అదనపు 1 kWp సామర్థ్యానికి kWకు రూ.18,000 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. 3 kWp కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సిస్టమ్‌లకు అదనపు సబ్సిడీ ఇవ్వరు.
ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌తో సహా విద్యుత్ అవసరాలను తీర్చడానికి గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (GHS/RWAs) చేపట్టే రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తారు. GHS/RWAలకు ఒక్కో ఇంటికి 3 kWp పరిమితికి లోబడి, 500 kWp సామర్థ్యం వరకు kWకు రూ.18,000 చొప్పున సహాయం అందిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం యుటిలిటీ-లెడ్ అగ్రిగేషన్(ULA) విధానం కింద 20.33 లక్షల గృహాలకు మొత్తం 4,066 MW సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం కింద TGSPDCL పరిధిలోని 10,11,533 గృహాలను గుర్తించి 2,023 MW సామర్థ్యాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
మొదటి దశలో 20,175 సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 81 మెగావాట్ల అంచనా సామర్థ్యంతో, 80 గ్రామాల్లోని 40,349 గృహాలకు సంబంధించి రూ.943.47 కోట్ల పరిపాలనాపరమైన ఆమోదాన్ని మంజూరు చేసింది. వీటిలో 43 గ్రామాలకు చెందిన 14,898 గృహాలు TGSPDCL పరిధిలో ఉన్నాయి.
అంతేకాదు.. సుమారు 126 మెగావాట్ల అంచనా సామర్థ్యంతో 16,805 వ్యవసాయ పంప్ సెట్ల కోసం సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. వీటిలో 8,964 వ్యవసాయ పంప్ సెట్లు TGSPDCL పరిధిలో ఉన్నాయి.
అక్టోబర్ 9 నాటికి TGSPDCL పరిధిలో నెట్-మీటరింగ్ విధానం కింద 30,259 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇందులో 29,777 సిస్టమ్స్ ఏర్పాటు చేయగా.. వాటి మొత్తం సామర్థ్యం 640.852 మెగావాట్లుగా ఉంది. PM సూర్య ఘర్ పథకం కింద 44,662 నమోదులు జరగగా, 125.613 మెగావాట్ల సామర్థ్యంతో 29,816 వ్యవస్థలు ఏర్పాటు అయ్యాయి. అలాగే 'మోడల్ సోలార్ విలేజ్' కార్యక్రమం కింద 4,335 రిజిస్ట్రేషన్లు జరగగా.. 6.407 మెగావాట్ల సామర్థ్యంతో 3,190 ఇన్‌స్టాలేషన్స్ జరిగాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


