...
...
Next Story

మీ ఇంటి వద్దకే 'మేడారం' ప్రసాదం - కేవలం రూ. 299కే డెలివరీ, బుకింగ్ ప్రాసెస్ ఇలా...

మేడారం భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలను ప్రకటించింది. జాతరకు వెళ్లలేని భక్తుల ఇంటి వద్దకే బంగారం ప్రసాదాన్ని చేర్చేందుకు లాజిస్టిక్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది. బంగారం ప్రసాదం ప్యాకెట్లో దేవతల ఫోటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయబడతాయి. భక్తులు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది.

Published on: Jan 17, 2026, 12:19:22 IST
Advertisement

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభమయ్యే ఈ జాతర… 31వ తేదీతో ముగుస్తుంది. అయితే ఇప్పటికే చాలా మంది భక్తులు మేడారం వెళ్తున్నారు. అయితే మేడారం వెళ్లలేని భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సేవలను ప్రకటించింది.

మేడారం జాతర
మేడారం జాతర

భక్తుల మనోభావాలను గౌరవిస్తూ…. వారు కోరుకున్న చోటికే అమ్మవార్ల ప్రసాదాన్ని (బంగారం) చేర్చేందుకు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సమయాభావం, రద్దీ లేదా ఇతర కారణాల వల్ల జాతరకు వెళ్లలేకపోయే భక్తులు నిరాశ చెందకుండా ఉండేందుకు దేవాదాయ శాఖ సహకారంతో ఆర్టీసీ ఈ వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని భక్తుల ఇంటి వద్దకే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను, టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ప్రాంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

కేవలం రూ. 299తోనే…

ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ మేడారం జాతర జరగనుంది. అయితే ఇప్పటికే చాలా మంది మేడారానికి వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో భక్తుల మరింత పెరగనుంది. ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని….. ఈసారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.భక్తుల రద్దీ అంచనాలకు మించి మరీ ఎక్కువగా ఉంటే… మరిన్ని బస్సులు నడిపే విధంగా ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది.

ఇక ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీకి 50 శాతం అదనపు మొత్తాన్ని జోడించి వసూలు చేస్తారు. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. ఇదే నిర్ణయం మేడారం ప్రత్యేక బస్సులకు వర్తించనుంది.

మరోవైపు మేడారంలో కూడా తాత్కాలిక బస్ స్టాండులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. క్యూలైన్లు, టిక్కెట్ల కౌంటర్, పార్కింగ్‌ స్థలాలు, క్యాంటీన్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకవస్తోంది. కమాండ్‌ కంట్రోల్‌ రూం, తాత్కాలిక మరుగుదొడ్లు, తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. బస్టాండ్ పనులు ఇప్పటికే కొనసాగుతుండగా…. ఈనెల 23న ప్రారంభించనున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks