TGSRTC Recruitment Update : టీఎస్‌టీ, ఎంఎస్‌టీ పరీక్షల ప్రాథమిక కీ విడుదల - ఇలా చెక్ చేసుకోండి

టీజీఎస్‌ఆర్టీసీలో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు, మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 29వ తేదీన రాత పరీక్ష కూడా నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు తాజాగా విడుదలయ్యాయి.

Published on: Apr 5, 2026, 06:47:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ(టీఎస్‌టీ), మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ(ఎంఎస్‌టీ) రాతపరీక్షల ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. ఈ మేరకు పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఓ ప్రకటన విడుదల చేసింది.

టీజీఎస్ఆర్టీసీ
టీజీఎస్ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 198 ఖాళీలున్నాయి. ఇందుకోసం మార్చి 29వ తేదీన ఎగ్జామ్ నిర్వహించగా… శనివారం (ఏప్రిల్ 05) ప్రాథమిక కీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ప్రాథమిక కీపై ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు అభ్యంతరాలు తెలుపొచ్చు. ప్రతి ప్రశ్నకు విడివిడిగా సరైన ఆధారపత్రాలతో సహా వెబ్‌సైట్‌లోని నిర్ణీత టెంప్లెట్‌ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను తప్పనిసరిగా అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌ ఏరియాలో ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పంపాల్సి ఉంటుంది.

TST, MST ప్రాథమిక కీ డౌన్లోడ్ ఇలా…

  1. అభ్యర్థులు https://www.tgprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. సూపర్ వైజర్ ట్రైనీయిస్ రిక్రూట్ మెంట్ 2025 ఆప్షన్ లోనిTST, MST ప్రాథమిక కీ ఆప్షన్లు ఉంటాయి.
  3. మీరు హాజరైన పరీక్షకు సంబంధించిన కీపై క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  4. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ప్రాథమిక కీ కాపీని పొందొచ్చు.

నోటిఫికేషన్ లో భాగంగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ (84), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ - 114 పోస్టులను భర్తీ చేస్తారు.అన్ని కలిపి 198 పోస్టులున్నాయి. అభ్యంతరాలు లెవనెత్తే అభ్యర్థులు…. ప్రతి ప్రశ్నకు రూ.500 రుసుంను చెల్లించాల్సి ఉంటుందని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పేర్కొంది. ఒకవేళ అభ్యర్థి లేవనెత్తిన అభ్యంతరం సరైనదిగా నిర్ధారణైతే రుసుంను తిరిగిచ్చేస్తామని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More