సంక్రాంతి సందడి మెుదలైపోయింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు చాలా మంది ఇప్పటికే రైలు, బస్సు, విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఫుల్ అయిపోయాయి. రైల్వే శాఖ సైతం ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇక ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు మాత్రం దారుణంగా పెంచేశారు. ముందస్తుగా ఏపీకి వెళ్లేవారు టికెట్లు బుక్ చేసేసుకున్నారు

చాలా మంది టికెట్లు దొరక్క ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. అలాంటివారికి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది ఆర్టీసీ. ఈ మేరకు వివరాలు వెల్లడించింది. ఈ బస్సు సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని బీహెచ్‌ఈఎల్ డిపో మేనేజర్ సుధా వెల్లడించారు.
ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు జనవరి 9 నుండి 13 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ శివారు ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు అదనపు బస్సు సర్వీసులను నడపుతోంది ఆర్టీసీ.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బీహెచ్ఈఎల్(ఆర్‌సీ పురం) డిపో నుండి మియాపూర్, కేపీహెచ్‌బీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR) మీదుగా ప్రయాణం సజావుగా సాగేలా, ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. సిటీలోకి వచ్చి వెళ్తే.. ట్రాఫిక్‌తో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చాలా టైమ్ వేస్ట్ అవుతుంది.
ఈ స్పెషల్ బస్సు సర్వీసులు అమలాపురం, కాకినాడ, నరసాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, చీరాల, విజయవాడతోపాటుగా ఇతర ప్రాంతాలను కవర్ చేస్తాయి. సంక్రాంతి ప్రత్యేక సర్వీసులు జనవరి 9 నుండి 13 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం, ప్రయాణికులు 9959226149 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.
ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ దృష్ట్యా తాజాగా 11 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సంక్రాంతి ఏపీకి వెళ్లి తిరిగి రావాలి అనుకునేవారికి ఈ ట్రైన్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
{{/usCountry}}దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ దృష్ట్యా తాజాగా 11 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సంక్రాంతి ఏపీకి వెళ్లి తిరిగి రావాలి అనుకునేవారికి ఈ ట్రైన్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నాయి. కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, పార్వతీపురం-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-పార్వతీపురం, కాకినాడ టౌన్-వికారాబాద్ మధ్య ఈ రైళ్లు నడుస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లలో 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ కోచ్‌లతో పాటు సెకండ్ క్లాస్ కోచ్‌లు కూడా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రా-తెలంగాణ మధ్య జనవరి 7వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ మధ్య ప్రయాణించేవారు.. బుకింగ్స్ చేసుకోవచ్చు, ప్రారంభమయ్యాయి.