తెలంగాణలోని అడవుల్లో పులుల సంఖ్యను లెక్కించేందుకు అటవీ శాఖ సిద్ధమైంది. నవంబర్ 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పులుల లెక్కింపు ప్రక్రియ ముదలు కానుంది. నిజానికి ఈ గణన చాలా రోజుల తర్వాత ప్రారంభం కావాల్సి ఉండేది. కానీ చలికాలం కావడంతో ఈ వాతావరణంలో పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుందని ముందుగానే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ లెక్కింపుతో పెద్దపులుల ప్రస్తుత స్థితి, సంరక్షణ అంచనా వేసేందుకు వీలుగా ఉంటుంది.

ఈ గణన కోసం అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. లెక్కింపు పద్ధతులపై అధికారులకు శిక్షణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రతీ జిల్లా నుంచి ఇద్దరు చొప్పున అధికారులు ఈ శిక్షణలో ఉంటారు. పులుల పాదముద్రలు, మలం, కెమెరా ట్రాప్స్ అమర్చడం, ఇతర సాంకేతిక పద్ధతులను ఉయోగించడంవంటి వాటిపై శిక్షణ ఇస్తారు. పులుల సంఖ్యను అత్యంత కచ్చితంగా లెక్కిస్తారు అధికారులు.
అమ్రాబాద్, కవ్వాల్ లాంటి టైగర్ రిజర్వ్‌లతోపాటు అన్ని రిజర్వ్ ఫారెస్ట్‌లు, ఏటూరునాగారం, పాకాల, ప్రాణహిత, శివరం, పోచారం, కిన్నెరసాని, మంజీరాలోని ఏడు వన్యప్రాణుల అభయారణ్యాలతో సహా అన్ని అటవీ ప్రాంతాలలో లెక్కింపు జరుగుతుంది. ఈ మేరకు పులులు సంచరించే అటవీ ప్రాంతాల్లో డేటా సేకరణ జరుగుతుంది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, శాస్త్రీయ పద్ధతులతో ప్రతీ పులిని గుర్తించి, వాటి వివరాలను నమోదు చేయనున్నారు. ఈ మేరకు నవంబర్ 20వ తేదీ నుంచి పులుల గణన ముదలుకానుంది. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం లెక్కింపు జరుగుతుంది.
అయితే మరో వార్త కూడా వినిపిస్తుంది. పులుల గణనకు వాలంటీర్లను పిలిచే అవకాసం ఉందని తెలుస్తోంది. అమ్రాబాద్, కవాల్‌లోని రెండు పులుల అభయారణ్యాలలో సిబ్బంది కొరత ఎదుర్కొంటున్న అటవీ శాఖ, నవంబర్‌లో జరిగే పులుల లెక్కింపును స్వచ్ఛంద సేవకులను ఆహ్వానించాలని యోచిస్తోందట.
ఇది వారికి అడవిలోకి వెళ్లడమే కాకుండా, వన్యప్రాణులను వాస్తవంగా పరిశీలించడానికి, పులి, అడవులు, మిగిలిన వన్యప్రాణులను రక్షించే ప్రయత్నాలకు తెలుసుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రకృతి, వన్యప్రాణులతో సంబంధం ఉన్న NGOలతో అక్టోబర్ 31న అటవీ శాఖ ఒక సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత స్వచ్ఛంద సేవా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎంపికైన వారందరికీ ఎలా నడవాలి? లెక్కింపు సమయంలో ఏం చేయాలి? ఎలా చేయాలో శిక్షణ ఇస్తారు. అయితే వాలంటీర్లను పులుల గణనలో భాగం చేసే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
{{/usCountry}}ఇది వారికి అడవిలోకి వెళ్లడమే కాకుండా, వన్యప్రాణులను వాస్తవంగా పరిశీలించడానికి, పులి, అడవులు, మిగిలిన వన్యప్రాణులను రక్షించే ప్రయత్నాలకు తెలుసుకునేందుకు ఉపయోగపడనుంది. ప్రకృతి, వన్యప్రాణులతో సంబంధం ఉన్న NGOలతో అక్టోబర్ 31న అటవీ శాఖ ఒక సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత స్వచ్ఛంద సేవా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎంపికైన వారందరికీ ఎలా నడవాలి? లెక్కింపు సమయంలో ఏం చేయాలి? ఎలా చేయాలో శిక్షణ ఇస్తారు. అయితే వాలంటీర్లను పులుల గణనలో భాగం చేసే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
{{/usCountry}}