రాష్ట్రంలో యూరియా సరఫరా కొనసాగుతోంది. అయితే ఈసారి ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. యూరియా కొనుగోలును సులభతరం చేయుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫెర్టిలైజర్ బుకింగ్ మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది.

గతంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ పంపిణీ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే అధికార యంత్రాగానికి కూడా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెంబర్
ఇక యూరియా పంపిణీలో ఏవైనా సమస్యలు ఉంటే రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. 18005995779 నెంబర్ ను సంప్రదించవచ్చని సూచించింది. ఇక జిల్లాల వారీగా కూడా వేర్వురు నెంబర్లను అందుబాటులో ఉంచారు. రైతులు యూరియా అందుబాటు పైన మరియు ఫెర్టిల్జర్ బుకింగ్ అప్ పైన ఎలాంటి ఆందోళన చెందొద్దని… అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉంటారని వ్యవసాయశాఖ చెబుతోంది.
యూరియా కొరత లేదు - మంత్రి తుమ్మల
రాష్ట్రవ్యాప్తంగా యూరియా పంపిణీ ప్రశాంతంగా సాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల చెప్పారు.. రాష్ట్రంలో యాసంగికి యూరియా కొరత లేదన్నారు. మంగళవారం నాటికి 2.15 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని రైతులను కోరారు.
యాప్ ద్వారా బుకింగ్ - ప్రాసెస్ ఇలా:
ప్రభుత్వం రైతులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచే ఎరువులు(ప్రస్తుతం యూరియా మాత్రమే అందిస్తారు) బుక్ చేసుకునేందుకు “Fertilizer Booking Mobile App”ను తీసుకొచ్చింది. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ / రిజిస్ట్రేషన్ అవ్వాలి.
ఎలా లాగిన్ అవ్వాలి?
- మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
- ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ చేయాలి.
- పట్టాదార్ పాస్‌బుక్ నంబర్ నమోదు చేయాలి.
- భూమి వివరాలు ఆటోమేటిక్‌గా యాప్‌లో చూపిస్తాయి.
సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) పంట, భూమి ఆధారంగా మీకు అర్హమైన యూరియా బ్యాగుల సంఖ్య యాప్‌లో చూపిస్తుంది.అవసరమైన బ్యాగుల సంఖ్య ఎంటర్ చేసి మీ జిల్లాలోని డీలర్ షాప్‌ను ఎంపిక చేసి బుకింగ్ కన్ఫర్మ్ చేయాలి.
{{/usCountry}}సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) పంట, భూమి ఆధారంగా మీకు అర్హమైన యూరియా బ్యాగుల సంఖ్య యాప్‌లో చూపిస్తుంది.అవసరమైన బ్యాగుల సంఖ్య ఎంటర్ చేసి మీ జిల్లాలోని డీలర్ షాప్‌ను ఎంపిక చేసి బుకింగ్ కన్ఫర్మ్ చేయాలి.
{{/usCountry}}జిల్లా / మండలం / గ్రామాన్ని అన్నదాతలు ఎంపిక చేయాలి. అందుబాటులో ఉన్న యూరియా స్టాక్ వివరాలు వస్తాయి. సమీప డీలర్ షాప్‌ల జాబితా కనిపిస్తుంది. తర్వాత అవసరమైన యూరియా బ్యాగుల సంఖ్య ఎంపిక చేయాలి. బుకింగ్ పూర్తయ్యాక బుకింగ్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ సాధారణంగా 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. డీలర్ దగ్గర యూరియా పొందడానికి బుకింగ్ ఐడీతో డీలర్ షాప్‌కు వెళ్లాలి. డీలర్ స్టాక్ చెక్ చేసి యూరియా బ్యాగులు ఇస్తారు. భూమి విస్తీర్ణం ఆధారంగా యూరియా స్పెల్స్ కేటాయింపు జరుగుతుంది.
పాస్‌బుక్ రైతుల యాప్‌లో లాగిన్ అయిన తర్వాత పాస్‌బుక్ నంబర్ ఎంటర్ చేయాలి. రైతు భరోసాకు అనుసంధానమైన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేస్తే భూమి వివరాలు ఓపెన్ అవుతాయి.