ఒడిశాలో మరో ఎన్‌కౌంటర్‌ - తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత గణేశ్‌ ఉయికే హతం..!

ఒడిశాలో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికేతో పాటు మరో ఐదుగురు మృతి చెందారు. తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన గణేశ్‌ ఉయికే… కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.

Published on: Dec 25, 2025, 14:57:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనతో పాటు మరో ఐదుగురు సభ్యులు మృతి చెందారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న గణేశ్ ఉయికే… కీలక నేతగా ఉన్నారు. ఆయన తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలానికి చెందిన వ్యక్తి. ఆయనపై రూ .1.1 కోట్ల రివార్డు ఉంది. ఒడిశాలో కేంద్రంగా కీలకమైన కార్యకలాపాలకు నాయకత్వం నేతగా గణేశ్ ఉయికేకు పేరుందని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

అర్ధరాత్రి కూడా కాల్పులు…!

బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మ అడవిలో బుధవారం రాత్రి భద్రతా బలగాలతో కాల్పులు జరిగాయి. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అయితే గురువారం ఉదయం చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో తాజాగా కాల్పులు జరిగాయి. ఇందులో ఉయికేతో సహా మరికొందరు మావోయిస్టులు మరణించారని పోలీసులు చెప్పారు.

ఈ కాల్పులు 69 ఏళ్ల గణేస్ ఉయికే(పాకా హన్మంతు) చనిపోయాడు. ఇతనికి రాజేష్ తివారీ, చామ్రు, రూపా అనే పేర్లు కూడా ఉన్నాయి. నల్గొండ జిల్లా చండూర్ మండలంలోని పుల్లెంల గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ కాల్పుల్లో చనిపోయిన మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవలి కాలంలో ఒడిశాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఆపరేషన్లలో ఇది ఒకటని పోలీసులు చెబుతున్నారు. "ఆపరేషన్ లో పాల్గొన్న భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని తాము బలంగా నిశ్చయించుకున్నాము" అని ఓ పోలీస్ అధికారి తెలిపారు.

ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా…. ఒడిశా పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ నకు చెందిన 20, సీఆర్పీఎఫ్ కు చెందిన ఇద్దరు, బీఎస్ఎఫ్ కు చెందిన ఒక బృందాలతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయని పేర్కొన్నారు.

గురువారం వివిధ ప్రాంతాల్లో అనేక కాల్పులు జరిగాయి. ఆ తర్వాత మావోయిస్టులకు చెందిన నలుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. రెండు ఇన్సాస్ రైఫిల్స్, 303 రైఫిల్స్ ను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More