...
...
Next Story

Hyderabad Traffic : హైదరాబాద్ ట్యాంక్‌బండ్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద తిరంగా ర్యాలీ కోసం ట్రాఫిక్ మళ్లింపులు ప్రకటించారు పోలీసులు. వీలైతే ఆ రూట్‌కు బదులుగా ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు.

Published on: Aug 14, 2026, 09:28:53 IST
Advertisement

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఉన్న M-47 ప్యాటన్ ట్యాంక్ వరకు నిర్వహించతలపెట్టిన తిరంగా ర్యాలీ(Tiranga Rally) సందర్భంగా ఈ ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

ట్రాఫిక్ మళ్లింపులు
ట్రాఫిక్ మళ్లింపులు

మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ర్యాలీ జరిగే సమయంలో సజావుగా ట్రాఫిక్ నిర్వహణ కోసం పోలీసులు కింద పేర్కొన్న విధంగా రూట్లను మళ్లించారు.

కర్బలా మైదాన్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ వైపు మళ్లిస్తారు.

డీబీఆర్ మిల్స్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ దిశగా వెళ్లే వాహనాలను డీబీఆర్ మిల్స్ వద్ద గోశాల, కవాడిగూడ వైపు తిప్పుతారు.

ముఖ్యంగా సెయిలింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్ కూడళ్ల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయే అవకాశం ఉంది. సాయంత్రం వేళల్లో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారికి, పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఈ మార్గాల్లో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది.

ప్రత్యామ్నాయ మార్గాలు

లోయర్ ట్యాంక్ బండ్, కవాడిగూడ, సికింద్రాబాద్ మార్గాలను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చని పోలీసులు పేర్కొన్నారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లకు ఈ మళ్లింపుల నుంచి సడలింపు ఉంటుంది. తిరంగా ర్యాలీ కార్యక్రమం పూర్తయిన వెంటనే మళ్లింపులు, రోడ్డు మూసివేతలను పూర్తిగా తొలగించి, రవాణాను పునరుద్ధరిస్తారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks