'షబ్-ఎ-ఖదర్' (జాగ్నే కీ రాత్) సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా ఆంక్షలు విధిచారు. మార్చి 16, 17 తేదీలలో రాత్రి 10:00 గంటల తర్వాత హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లైఓవర్లపై ద్విచక్ర వాహనాలను అనుమతించరు. ఏ ఫ్లైవర్లపై ఆంక్షలు ఉన్నాయో చూడండి.
- జూ పార్క్-ఆరామ్‌ఘర్ మధ్య ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్
- దేవి బాగ్-జూ పార్క్ గేట్ నం. 2 మధ్య ఉన్న బహదూర్‌పురా ఫ్లైఓవర్
- హషమాబాద్‌లోని నయారా పెట్రోల్ పంప్ నుండి ఫూల్‌బాగ్ DLRL వరకు ఉన్న చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్
- పిసల్‌బండ, లక్ష్మారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ మధ్య ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్లపై ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.

రాత్రి వేళల్లో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉన్నందున, రహదారి భద్రతను కోసం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేదా ప్రమాదాలు జరగకుండా నివారించడానికి ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచించారు. ఏవైనా అసౌకర్యాలు కలిగితే, వాహనదారులు 9010203626 నంబర్ ద్వారా ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. మార్చి 16, 17వ తేదీల్లో రాత్రి 10 గంటల తర్వాత కొన్ని ఫ్లైఓవర్లపై బైక్‌లను అనుమతించమని.. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ప్రకటనలో తెలిపారు.
షబ్-ఎ-ఖదర్
షబ్-ఎ-ఖదర్‌ను లైలతుల్ ఖదర్ అని కూడా అంటారు. పవిత్రమైన రంజాన్ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన రాత్రిగా భావిస్తారు. ఇది వెయ్యి నెలల కంటే ఉత్తమమైన రాత్రిగా ముస్లింలకు నమ్మకం. రంజాన్ మాసంలో 27వ రాత్రి వచ్చే షబ్ ఏ ఖద్ర్ రోజునే పవిత్ర దివ్యఖురాన్ అవతరించిందని నమ్ముతారు. రంజాన్ చివరి పది రోజులలో, ముఖ్యంగా 27వ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు, ఖురాన్ పఠనంతో ఆధ్యాత్మికంగా జరుపుకొంటారు.
షబ్ అంటే రాత్రి, ఖద్ర్ అంటే ఉన్నతమైన అని అర్థం ఉంది. ఈ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు ముస్లింలు. రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. తరావీహ్ నమాజ్, బయాన్, హదీస్, ఖురాన్ తిలావత్, సలాతుజ్, తజ్బీ, తహజ్జుద్ నమాజ్, దువా ఇలా రాత్రి మెుత్తం.. అల్లా ఆరాధనలోనే ఉంటారు. తోబా, అస్తగ్ఫిరుల్లా చదివి తప్పుల నుంచి క్షమాపణ కోరి, నరకం, నరకాగ్ని నుంచి ముక్తి కోరుకుంటారు. ఈ పర్వదినం రోజున.. వెయ్యి నెలలకుపైగా ప్రార్థనలు చేసిన పుణ్యం లభిస్తుందని చెబుతారు.
{{/usCountry}}షబ్ అంటే రాత్రి, ఖద్ర్ అంటే ఉన్నతమైన అని అర్థం ఉంది. ఈ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు ముస్లింలు. రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. తరావీహ్ నమాజ్, బయాన్, హదీస్, ఖురాన్ తిలావత్, సలాతుజ్, తజ్బీ, తహజ్జుద్ నమాజ్, దువా ఇలా రాత్రి మెుత్తం.. అల్లా ఆరాధనలోనే ఉంటారు. తోబా, అస్తగ్ఫిరుల్లా చదివి తప్పుల నుంచి క్షమాపణ కోరి, నరకం, నరకాగ్ని నుంచి ముక్తి కోరుకుంటారు. ఈ పర్వదినం రోజున.. వెయ్యి నెలలకుపైగా ప్రార్థనలు చేసిన పుణ్యం లభిస్తుందని చెబుతారు.
{{/usCountry}}