హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ కీసర క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఆరాధ్య కన్వెన్షన్ హాల్ ఒక వివాహ మహోత్సవం జరిగింది. తెలంగాణ రక్షణ సేన నాయకుడు, గతంలో తెలంగాణ జాగృతిలో క్రియాశీలకంగా పనిచేసిన బాషబోయిన బాలప్రసాద్, సీతాఫల్‌మండికి చెందిన శివానిల వివాహ వేడుక వైభవంగా జరిగింది.

ఈ కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరుకావడమే కాకుండా, వరుడి కుటుంబంలో ఒక ఇంటి ఆడబిడ్డగా పూర్తి బాధ్యతలు తీసుకుని ముదిరాజ్ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి క్రతువులను దగ్గరుండి జరిపించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాలప్రసాద్‌కు సొంతంగా అక్కాచెల్లెళ్లు లేరు. తెలంగాణ జాగృతి కాలం నుండి కల్వకుంట్ల కవితతో ఉన్న ఆత్మీయ అనుబంధం, గౌరవంతో తన పెళ్లిలో ఆమెనే తన సొంత సోదరి స్థానంలో ఉండి ఆడపడుచుగా వివాహ ఆచారాలను నిర్వహించాలని బాలప్రసాద్ ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తికి కవిత ఎంతో సంతోషంతో అంగీకారం తెలిపారాని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ముదిరాజ్ సమాజంలో ఉన్న ప్రత్యేక ఆచారం ప్రకారం, వరుడు మాంగళ్యధారణ (మంగళసూత్రం కట్టడం) చేయడానికి ముందే, వరుడి వైపు సోదరి లేదా కుటుంబానికి చెందిన మహిళా ప్రతినిధి కొన్ని ముఖ్యమైన వివాహ క్రతువులు నిర్వహించాల్సి ఉంటుంది.
ముందుగా కల్వకుంట్ల కవిత వధువు శివానితో కలసి ప్రత్యేకంగా నిర్వహించిన గౌరీ పూజలో పాల్గొన్నారు. ముదిరాజ్ ఆచారం ప్రకారం కవిత పసుపు కొమ్ముతో తయారు చేసిన తాళిని వధువు శివాని మెడలో మూడు ముళ్లు వేసి ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేశారు. అనంతరం నవవధువు వేలికి ఉంగరాన్ని తొడిగారు.
చివరగా ముదిరాజ్ సాంప్రదాయ పద్ధతిలో వధువుకు ఒడిబియ్యం పోసి, కొత్త దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. కవిత ద్వారా ఈ సాంప్రదాయ క్రతువులన్నీ విజయవంతంగా పూర్తయిన తర్వాత, వరుడు బాలప్రసాద్ వధువు శివాని మెడలో ప్రధాన మంగళసూత్రాన్ని ధరింపజేయడంతో వివాహ వేడుక శాస్త్రోక్తంగా పూర్తయింది.
{{/usCountry}}చివరగా ముదిరాజ్ సాంప్రదాయ పద్ధతిలో వధువుకు ఒడిబియ్యం పోసి, కొత్త దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. కవిత ద్వారా ఈ సాంప్రదాయ క్రతువులన్నీ విజయవంతంగా పూర్తయిన తర్వాత, వరుడు బాలప్రసాద్ వధువు శివాని మెడలో ప్రధాన మంగళసూత్రాన్ని ధరింపజేయడంతో వివాహ వేడుక శాస్త్రోక్తంగా పూర్తయింది.
{{/usCountry}}ఈ ఆత్మీయ వేడుకలో వరుడు బాలప్రసాద్ తల్లిదండ్రులు స్వరూప, బాలకృష్ణలతో పాటు ఆయన సోదరుడు నాగరాజు, ఇతర కుటుంబ సభ్యులు కవిత ఇంటి ఆడబిడ్డగా మారి చేసిన పనులకు ఎంతో పొంగిపోయారు. తెలంగాణ రక్షణ సేనకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ఇరువర్గాల బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
బిజీ షెడ్యూల్‌లోనూ కార్యకర్త కుటుంబంలోని సభ్యురాలిలా కవిత చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. సొంత సోదరిలా మారి పెళ్లి క్రతువులు జరిపించిన కల్వకుంట్ల కవిత తీరుపై ముదిరాజ్ సంఘ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.