తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. అర్హులైన అభ్యర్థుల కోసం నిర్వహించే ఎస్ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 05.06.2026 నుంచి 12.06.2026 వరకు జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షలు నిర్వహించడానికి అందుబాటులో ఉన్న సమయం పరిమితంగా ఉండటంతో రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ ఫలితాలను వేచి చూడకుండా దరఖాస్తు స్వీకరిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

పదో తరగతి మార్చి 2026 పరీక్షల్లో ఫెయిల్ అయినవారు.. అలాగే 2015 సీసీఈ ప్యాటర్న్ నుంచి ఫెయిల్ అయినవారు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలనుకుంటే.. 30.04.2026 నుంచి నిర్ణిత గడువు ప్రకారం పరీక్ష ఫీజును చెల్లించాలని అధికారులు వెల్లడించారు.
అభ్యర్థులు పరీక్ష ఫీజను సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయులకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించడానికి గడువు తేదీని 14.05.2026గా నిర్ణయించారు. హెడ్‌మాస్టర్లు ఈఎన్ఆర్‌ను ఆన్‌లైన్ ద్వారా డీఈవోకు సమర్పించడానికి చివరి తేదీ 15.05.2026గా ఉంది. డీఈఓలు ఈఎన్ఆర్‌ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి ఆన్‌లైన్ ద్వారా సమర్పించడానికి గడువు తేదీ 16.05.2026గా ఉంది. రూ.50 ఆలస్య రుసుముతో సంబంధిత సబ్జెక్ట్ పరీక్ష ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు చెల్లించవచ్చు.
రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ షెడ్యూల్
రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ షెడ్యూల్‌ను కూడా అధికారులు ప్రకటించారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో https://bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునే.. అభ్యర్థులు 30.04.2026 నుంచి 14.05.2026 వరకు నిర్దేశిత విధానం ప్రకారం.. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- మార్కుల రీకౌంటింగ్ ఫీజు-రూ.500
- రీ-వెరిఫికేషన్-రూ.1000(ఒక్కో సబ్జెక్ట్‌కు ఉంటుంది)
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం కొన్ని పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి హాల్ టికెట్ జిరాక్స్, హెడ్‌మాస్టర్ సంతకం చేసిన కంప్యూటరైజ్డ్ మార్క్స్ మెమో ప్రతులు, దరఖాస్తులు వ్యక్తిగత అభ్యర్థి లేదా హెడ్‌మాస్టర్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. బోర్డుకు పోస్టు ద్వారా చేసిన దరఖాస్తులను స్వీకరించరు.
ఇక రీ వెరిఫికేషన్‌లో పలు విషయాలు ఉంటాయి. మార్కుల మళ్లీ లెక్కిస్తారు. అన్ని సమాధానాలకు మార్కులు నమోదు చేసిన విషయాన్ని పరిశీలిస్తారు. మూల్యాంకనం చేయని సమాధానాలు ఉంటే మూల్యాంకనం చేస్తారు. తక్కువగా మార్కులు ఇచ్చారని చేసే అభ్యర్థనలు పరిగణించరు.
{{/usCountry}}ఇక రీ వెరిఫికేషన్‌లో పలు విషయాలు ఉంటాయి. మార్కుల మళ్లీ లెక్కిస్తారు. అన్ని సమాధానాలకు మార్కులు నమోదు చేసిన విషయాన్ని పరిశీలిస్తారు. మూల్యాంకనం చేయని సమాధానాలు ఉంటే మూల్యాంకనం చేస్తారు. తక్కువగా మార్కులు ఇచ్చారని చేసే అభ్యర్థనలు పరిగణించరు.
{{/usCountry}}