తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) కీలక అప్డేట్ అందించింది. పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి రాత పరీక్షల తేదీలను బోర్డు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

సబ్ ఇన్స్‌పెక్టర్ (SI) పోస్టుల అభ్యర్థులకు నవంబర్ 29న రాత పరీక్ష నిర్వహించనున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్థులకు డిసెంబర్ 20న పరీక్ష జరగనుంది.
రాష్ట్ర హోంశాఖ పరిధిలోని వివిధ కీలక విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నియామకాల ద్వారా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల్లో ఖాళీలను పూరించనున్నారు.
ఈ ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించిందని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం 5,77,064 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎస్ఐ పోస్టులకు 1,60,756 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు 3,89,356 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పోలీసు నియామకాల ప్రక్రియలో భాగంగా ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలు ఖరారైనందున అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
పరీక్షకు కొన్ని రోజుల ముందుగా TSLPRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అభ్యర్థులు ఎవరి మాటలు నమ్మకుండా కేవలం ప్రతిభపైనే ఆధారపడాలని బోర్డు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాలు, హాల్ టిక్కెట్ డౌన్లోడ్ తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
{{/usCountry}}పరీక్షకు కొన్ని రోజుల ముందుగా TSLPRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అభ్యర్థులు ఎవరి మాటలు నమ్మకుండా కేవలం ప్రతిభపైనే ఆధారపడాలని బోర్డు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాలు, హాల్ టిక్కెట్ డౌన్లోడ్ తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
{{/usCountry}}పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో 74 శాతానికిపైగా పురుషులు ఉన్నారు. మహిళా అభ్యర్థులు 25 శాతానికి పైగా ఉన్నారు. కేటగిరీల వారిగా చూస్తే.. బీసీ అభ్యర్థులు 49 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 43 శాతానికి పైగా దరఖాస్తులు చేశారు. అయితే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ 97 శాతానికి పైగా అభ్యర్థులు పూర్తి చేశారు. మిగిలినవారు సెప్టెంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాలి. వివరాల కోసం https://www.tgprb.in/ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.