తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్షల తేదీలు విడుదల.. TSLPRB ప్రకటన
Telangana Police Recruitment 2026 : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను ప్రకటించింది.
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి (TSLPRB) కీలక అప్డేట్ అందించింది. పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి రాత పరీక్షల తేదీలను బోర్డు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

సబ్ ఇన్స్‌పెక్టర్ (SI) పోస్టుల అభ్యర్థులకు నవంబర్ 29న రాత పరీక్ష నిర్వహించనున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్థులకు డిసెంబర్ 20న పరీక్ష జరగనుంది.
రాష్ట్ర హోంశాఖ పరిధిలోని వివిధ కీలక విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నియామకాల ద్వారా పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖల్లో ఖాళీలను పూరించనున్నారు.
ఈ ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించిందని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం 5,77,064 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎస్ఐ పోస్టులకు 1,60,756 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు 3,89,356 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పోలీసు నియామకాల ప్రక్రియలో భాగంగా ప్రాథమిక రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు, తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలు ఖరారైనందున అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
పరీక్షకు కొన్ని రోజుల ముందుగా TSLPRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, అభ్యర్థులు ఎవరి మాటలు నమ్మకుండా కేవలం ప్రతిభపైనే ఆధారపడాలని బోర్డు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాలు, హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో 74 శాతానికిపైగా పురుషులు ఉన్నారు. మహిళా అభ్యర్థులు 25 శాతానికి పైగా ఉన్నారు. కేటగిరీల వారిగా చూస్తే.. బీసీ అభ్యర్థులు 49 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 43 శాతానికి పైగా దరఖాస్తులు చేశారు. అయితే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ 97 శాతానికి పైగా అభ్యర్థులు పూర్తి చేశారు. మిగిలినవారు సెప్టెంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాలి. వివరాల కోసం https://www.tgprb.in/ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


