TSLPRB Recruitment 2026 : తెలంగాణలో పోలీసు కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు టీఎస్‌ఎల్‌ఆర్‌బీ కీలక సూచన చేసింది. విధి నిర్వహణలో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. పోలీస్ ఉద్యోగాల ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రేపటి(సెప్టెంబర్ 16)తో ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుంది.

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఇటీవలే విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం…. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5:00 గంటలలోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రారంభ నోటిఫికేషన్ ప్రకారంగా సెప్టెంబర్ 9వ తేదీనే చివరి తేదిగా నిర్ణయించినప్పటికీ, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అధికారులు గడువును పెంచారు. ఈ పెంచిన గడువు రేపటితో ముగుస్తుండటంతో…. మరోసారి తేదీలను పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాబట్టి చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు ఎదురవకుండా ముందే అప్లై చేసుకోవడం ఉత్తమం.
మొత్తం 7,437 ఖాళీల వివరాలు:
గత జులై 29న టీఎస్‌ఎల్‌ఆర్‌బీ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి:
- పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 పోస్టులు
- స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) కానిస్టేబుల్: 1,380 పోస్టులు
- పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్ - AR): 1,052 పోస్టులు
- ఫైర్ ఫైటర్ (తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్): 751 పోస్టులు
- జైలు వార్డర్ (తెలంగాణ జైళ్ల శాఖ): 208 పోస్టులు
- పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL - పురుషులు): 24 పోస్టులు
- అధికారిక వెబ్ సైట్ - https://www.tgprb.in/
పోస్టుల స్థాయిని బట్టి బోర్డు ఫీజు వివరాలను నిర్ణయించింది. సబ్ ఇన్స్పెక్టర్ (SI) స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకునే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.750, అలాగే ఇతర వర్గాల (ఓసీ, బీసీ) అభ్యర్థులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది.
{{/usCountry}}పోస్టుల స్థాయిని బట్టి బోర్డు ఫీజు వివరాలను నిర్ణయించింది. సబ్ ఇన్స్పెక్టర్ (SI) స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకునే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.750, అలాగే ఇతర వర్గాల (ఓసీ, బీసీ) అభ్యర్థులు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది.
{{/usCountry}}ఇక పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డెన్ పోస్టులకు దరఖాస్తు చేసే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 గాను, మిగతా అభ్యర్థులందరికీ రూ.1,200 గాను ఫీజును నిర్ణయించారు.
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత ఉండి దరఖాస్తు చేసే వారికి బోర్డు ఒక మంచి వెసులుబాటు కల్పించింది. అభ్యర్థులకు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)లను ఒకే ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సాధించిన ఫలితాలనే అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న అన్ని రకాల పోస్టులకూ ప్రామాణికంగా పరిగణిస్తారు. దీనివల్ల ప్రతి పోస్టుకు వేర్వేరుగా ఫిజికల్ టెస్టులు హాజరవ్వాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా అవుతుంది.