...
...
Next Story

NTPC Ramagundam : ఆ విషయంలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వండి - సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలో NTPC ఏర్పాటు చేయనున్న థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం(PPA) చేసుకోవాలని కోరారు.ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకునేందుకు NTPC కి తగిన స్వేచ్ఛను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Published on: Mar 9, 2026, 11:50:12 IST
Advertisement

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుపై కీలక సూచనలు చేశారు. సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేయనున్న 3X800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం(PPA) చేసుకోవాలని సూచించారు. 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మొదటి ఫేజ్ లో లాగే రెండవ ఫేజ్ లో ఉత్పత్తి చేసే విద్యుత్ లో 85 శాతం విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా అవుతదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. 3 మార్చి, 2026 న తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యిందని గుర్తు చేశారు. రానున్న రోజులలో ఈ డిమాండ్ మరింతగా పెరగనుందన్నారు. అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసిందని పేర్కొన్నారు.

NTPC సిద్ధంగా ఉంది - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

“అతి తక్కువ ఖర్చుతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంలో NTPC కి దేశంలోనే విశేషమైన అనుభవం ఉంది. గతంలో విద్యుత్ రంగం మీద రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చలో భాగంగా మొదటి ఫేజ్ లో భాగంగా NTPC రామగుండంలో ఏర్పాటు చేసిన థర్మల్ పవర్ ప్రాజెక్టును గురించి స్వయంగా మీరు ప్రశంసించారు. ఇప్పుడు 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో NTPCకి తగిన స్వేచ్ఛను ఇవ్వండి. థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి NTPC సిద్ధంగా ఉంది” అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks