...
...
Next Story

గణేశ్‌ మండపాల నిర్వహణకు ఆన్‌లైన్‌లో నమోదు తప్పనిసరి.. ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో గణేష్ మండపాల నిర్వహణకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి. నమోదు చేసుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని సీపీ సజ్జనార్ తెలిపారు.

Published on: Sep 8, 2026, 14:05:41 IST
Advertisement

హైదరాబాద్ మహా నగరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగర పోలీస్ యంత్రాంగం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. నగరంలో ఎక్కడైనా గణేశ్ మండపాలను ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగా ఆన్‌లైన్ ద్వారా సమాచారాన్ని నమోదు చేసుకోవాలని హైదరాబాద్ సీపీ వెల్లడించారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి, భద్రతను పర్యవేక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ఎలా చేయాలి?

గణేష్ మండపాల నిర్వహణకు రిజిస్ట్రేషన్
గణేష్ మండపాల నిర్వహణకు రిజిస్ట్రేషన్

ఉత్సవ నిర్వాహకులు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. నిర్వాహకులు వెంటనే తెలంగాణ పోలీసు అధికారిక పోర్టల్ policeportal.tspolice.gov.in/index.htmను సందర్శించి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఫారమ్‌లో మండపం నిర్మిస్తున్న ప్రదేశం, మండప కమిటీ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, విగ్రహం ఎత్తు, ఉత్సవాలు జరిగే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, వెళ్లే మార్గం వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి. దరఖాస్తు దాఖలు చేసిన తర్వాత సంబంధిత స్థానిక పోలీసు స్టేషన్ అధికారులకు సమాచారం వెళ్తుంది. తుది నిమిషం వరకు వేచి చూడకుండా ఉత్సవ కమిటీలు వెంటనే నమోదు పూర్తి చేసి భాగ్యనగర పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

ఆన్‌లైన్‌లో సమాచారం నమోదు చేయడంతో పాటు, స్థానిక యంత్రాంగం నుంచి కొన్ని నిరభ్యంతర పత్రాలు పొందడం ఉత్సవ కమిటీల బాధ్యత. విద్యుత్ సరఫరా కోసం తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ అనుమతి పొంది, విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలి.

హైదరాబాద్ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో వినాయక మండపాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఈ వివరాలు పోలీసులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయా ప్రాంతాల్లో సిసిటివి (CCTV) కెమెరాల ఏర్పాటు, పెట్రోలింగ్ పెంచడానికి వీలవుతుంది.

మండపాల వద్ద భక్తుల రద్దీని బట్టి వాహనాల మళ్లింపు, ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవచ్చు. అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలపై నిఘా ఉంచేందుకు పోలీసు యంత్రాంగానికి ముందస్తు సమాచారం సహాయపడుతుంది. నగరంలోని నిమజ్జన ప్రదేశాల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేయడం సులువవుతుంది.

రాత్రి వేళల్లో మైక్‌లు, బాక్సుల వాడకంపై నిబంధనలను కచ్చితంగా పాటించాలి. పరిమితికి మించిన శబ్దాలతో మైక్‌లు వాడితే చర్యలు ఉంటాయి. ప్రతి మండపం వద్ద రాత్రి వేళల్లో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు కమిటీ సభ్యులు కాపలాగా ఉండాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks