...
...
Next Story

AP TG Inter Results 2026 : ఏపీ, తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు…? ఎక్కడ చెక్ చేసుకోవాలి...?

AP Telangana Inter Results 2026 : తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతోంది. అయితే ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయి..? ఎక్కడ చెక్ చేసుకోవాలి...? వంటి విషయాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: Mar 28, 2026, 15:39:41 IST
Advertisement

ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. మరోవైపు ఆయా బోర్డులు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. సాధ్యమైనంత త్వరగానే ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నాయి. మూల్యాంకన ప్రక్రియలో ఎక్కడా కూడా తేడాలు రాకుండా చర్యలు చేపడుతున్నాయి.

టీజీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు..?

ఏపీ, తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026
ఏపీ, తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2026

ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే సంస్కృతం సబ్జెక్ట్ పేపర్ల మూల్యాంకనం పూర్తి అయింది. ఇప్పటికే 3 విడతలు కూడా పూర్తయ్యాయి. దాదాపు అన్ని పేపర్లు పూర్తయ్యాయి. ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా చూడాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. వాల్యూయేషన్ ప్రాసెస్ పూర్తి కాగా… మార్కుల ఎంట్రీ, సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం…. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 5 లేదా 6వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తంగా మొదటి వారంలోనే ఫలితాలు రావొచ్చని సమాచారం. ఒకవేళ ఆలస్యమైతే ఏప్రిల్ 10వ తేదీలోపు కచ్చితంగా విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాదిలో చూస్తే… తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన విడుదలయ్యాయి. అయితే ఈసారి మాత్రం త్వరగానే ఫలితాలు అందుబాటులోకి వస్తాయి.

టీజీ ఇంటర్ ఫలితాలు ఎక్కడ చెక్ చేసుకోవాలి..?

  • టీజీ ఇంటర్ ఫలితాలు https://www.tgbie.in/index.html వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లోకి వెళ్లాలి.
  • ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ విద్యార్థి హాల్‌టికెట్ నెంబర్ ను నమోదు చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్ కాపీని పొందాల్సి ఉంటుంది.

ఏపీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు..?

ఏపీలో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతోంది. విడతల వారీగా ఏప్రిల్ 14వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. పేపర్ వాల్యూయేషన్ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ పరిశీలిస్తారు. ఆపై చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశలుంటాయి. ఈ ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది.

ఏపీ ఇంటర్ విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్‌ చేసుకోవచ్చు. ఏపీ ఫస్టియర్‌ రిజల్ట్‌, సెకండిర్‌ రిజల్ట్స్ నేరుగా చెక్ చేసుకోవచ్చు.

మనమిత్ర వాట్సాప్‌లో ఇలా..

  • మనమిత్ర వాట్సప్‌లో 95523 00009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ సెండ్ చేయాలి.
  • రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ఎంచుకోండి
  • తర్వాత ‘Education Services’ ఆప్షన్‌ క్లిక్‌ చేయండి
  • ఇంటర్ పరీక్షల ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోండి అని కనబడుతుంది.
  • ఫలితాల డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ యాక్టివ్‌ అయిన తర్వాత మీ హాల్‌టికెట్‌ నెంబర్ నమోదు చేయాలి.
  • మీ వాట్సప్‌ నెంబర్‌కు వచ్చే ఫలితాలు / మార్కుల షార్ట్‌ మెమో పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks