Khairatabad Bypoll : హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక రాబోతుండటంతో రాజధాని రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అనేక పరిణామాల మధ్య దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటంతో… ఎమ్మెల్యేగా దిగిపోవాల్సి వచ్చింది. ఈ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ నుంచి కూడా అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.

ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని మూడు పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యే పనిలో పడ్డాయి. మరోవైపు ఆశవాహులు కూడా తమ వంతు ప్రయత్నాలు గట్టిగా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. అయితే, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్ఎస్… న్యాయ పోరాటం ప్రారంభించింది. శాసనసభ స్పీకర్ స్థానం నుంచి మొదలుకొని హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లింది.
ఈ ఫిరాయింపు పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు…. దానం నాగేందర్ పార్టీ మారినట్లు స్పష్టం చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దానం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పురస్కరించుకుని, ఖైరతాబాద్ శాసనసభ స్థానం 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే ఖాళీగా ఉన్నట్లు శాసనసభ కార్యదర్శి సోమవారం నాడు అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2023లో గెలిచిన దానం నాగేందర్ అనర్హత వేటు 2024 ఏప్రిల్ 23 నుంచే అమలులోకి వచ్చిందని ఈ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.
బరిలో నిలిచేది ఎవరు….?
ఉపఎన్నిక ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ దానం నాగేందర్ పోటీ చేయడం దాదాపు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే… గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించిన విజయా రెడ్డి కూడా ఈసారి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. వీరితో పాటు కాంగ్రెస్ వర్గాల్లో రోహిన్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. పార్టీ అధిష్ఠానం ఎవరికి మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
{{/usCountry}}ఉపఎన్నిక ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ దానం నాగేందర్ పోటీ చేయడం దాదాపు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే… గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించిన విజయా రెడ్డి కూడా ఈసారి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. వీరితో పాటు కాంగ్రెస్ వర్గాల్లో రోహిన్ రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. పార్టీ అధిష్ఠానం ఎవరికి మొగ్గు చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
{{/usCountry}}మరోవైపు, తమకు పట్టున్న ఖైరతాబాద్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది ఈ ఎన్నికలో అత్యంత కీలకంగా మారనుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ పేరు ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న మన్నె కవితారెడ్డి (మన్నె గోవర్ధన్‌రెడ్డి) కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరికి తోడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి పేరును కూడా గులాబీ పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన భారతీయ జనతా పార్టీ ఈ ఉపఎన్నికను అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మరోసారి బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక్కరిద్దరూ నేతలు కూడా పార్టీ టికెట్ కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
గత(2023 అసెంబ్లీ) ఎన్నికల గణాంకాలు ఇవే
- బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్: 63,068 ఓట్లు
- బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి: 34,666 ఓట్లు
- కాంగ్రెస్ అభ్యర్థి విజయా రెడ్డి: 33,549 ఓట్లు
గత ఎన్నికల్లో దానం నాగేందర్ 28,402 ఓట్ల భారీ ఆధిక్యంతో బీజేపీ తరపున విజయం సాధించారు. అయితే, ఇప్పుడు మారిన సమీకరణలు, ఆయన కాంగ్రెస్‌లో చేరడం, ఉపఎన్నిక అనివార్యం కావడం వంటి అంశాలు ఖైరతాబాద్ పోరును త్రిముఖ సమరంగా మార్చేశాయి. ఈసారి విజయం ఏ పార్టీని వరిస్తుందో వేచి చూడాల్సిందే.