డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ అందమైన అమ్మాయి 'కాఫీ తాగుదాం పదా' అని పిలిస్తే.. శేఖర్ అనే వ్యక్తి గుండెల్లో సంతోషమైంది. ‘నాకూ ఒక రోమియో కథ దొరికింది’ అని సంబరపడిపోతూ, జూబ్లీహిల్స్‌లోని ఒక రిచ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. మాటలు, నవ్వులు, రకరకాల వంటకాలతో కాలాన్ని మర్చిపోయారు.

కానీ అసలు ట్విస్ట్ బిల్లు రూపంలో ముంగిట వాలినప్పుడే ఎదురైంది. చేతికి వచ్చిన బిల్లు చూసి శేఖర్ కళ్ళు బైర్లు కమ్మాయి. అక్షరాలా రూ.28,000 బిల్లు. ఓ సాధారణ ఉద్యోగి నెల జీతం, కొంతమందికి అంతకంటే ఎక్కువనే. బిల్లు వచ్చేముందు అమ్మాయి తన తెలివి ఉపయోగించింది. ఓయ్ కాసేపట్లో వస్తాను.. అని వాష్‌రూమ్ సాకు చెప్పి లేచి వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. పాపం, శేఖర్ జేబు ఖాళీ చేసుకుని, హృదయం గాయపడి, ఏం చేయాలేక పోయిన సొమ్మును తలుచుకుంటూ నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్‌లో ఇలా ప్రేమ దోపిడీకి గురైనవారు నగరంలో చాలా మంది ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల్లో ఏకంగా 70కి పైగా ఇలాంటి కేసులే ఉండటం గమనార్హం. ఇందులో 33 కేసులు కేవలం నగరంలోని ప్రధాన పబ్‌లు, రెస్టారెంట్లలో జరిగినవే. గత 5 నెలల్లోనే ఈ రకం డేటింగ్ స్కామ్‌లలో నగర యువకులు ఏకంగా రూ.35 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.
'మహిళలు తమను ఖరీదైన రెస్టారెంట్లు, కేఫ్‌లకు తీసుకెళ్లి, భారీ బిల్లులు ఇచ్చి, తమను ఇరకాటంలో పెట్టి అదృశ్యమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. వీటిలో చాలా వరకు అధిక బిల్లులు వసూలు చేయడం, మైనర్లకు మద్యం అందించడం వంటి వాటికి సంబంధించినవి.' అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
అబ్బాయిలను నమ్మించి, జూబ్లీహిల్స్ లాంటి ఏరియాల్లోని కాస్ట్లీ పబ్‌లు, కేఫ్‌లకు తీసుకెళ్లడం, భారీగా ఆర్డర్లు పెట్టి బిల్లు ఊహించని రేంజ్‌కు పెంచేయడం, ఆ తర్వాత అమ్మాయిలు మెల్లగా జారుకోవడం.. ఇదీ ఈ స్ట్రాటజీ. ఈ వ్యవహారంలో కేవలం అమ్మాయిలే కాకుండా, పబ్‌ల యాజమాన్యాలు కూడా జతకట్టి ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని 33కి పైగా పబ్‌లపై సైబర్ క్రైమ్, షీ టీమ్స్ ఫోకస్ చేశాయి.
{{/usCountry}}అబ్బాయిలను నమ్మించి, జూబ్లీహిల్స్ లాంటి ఏరియాల్లోని కాస్ట్లీ పబ్‌లు, కేఫ్‌లకు తీసుకెళ్లడం, భారీగా ఆర్డర్లు పెట్టి బిల్లు ఊహించని రేంజ్‌కు పెంచేయడం, ఆ తర్వాత అమ్మాయిలు మెల్లగా జారుకోవడం.. ఇదీ ఈ స్ట్రాటజీ. ఈ వ్యవహారంలో కేవలం అమ్మాయిలే కాకుండా, పబ్‌ల యాజమాన్యాలు కూడా జతకట్టి ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని 33కి పైగా పబ్‌లపై సైబర్ క్రైమ్, షీ టీమ్స్ ఫోకస్ చేశాయి.
{{/usCountry}}డేటింగ్ యాప్ ఆధారిత హనీ ట్రాప్ కేసులకు పోలీసులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి దర్యాప్తు చేస్తున్నారు. పబ్‌ల యజమానులకు ఈ మోసాలలో ప్రమేయం ఉందా అనే కోణంలో సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. అర్ధరాత్రి దాటినా పబ్‌లు నడపడం, మైనర్లకు మద్యం సరఫరా చేయడం, శబ్ద కాలుష్యం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కూడా ప్రత్యేక నిఘా పెట్టారు.
డేటింగ్ యాప్‌లో ఎవరో పంపిన స్మైలీకి మైమరిచిపోయి, మొదటి డేట్‌లోనే కాస్ట్లీ పబ్‌లకు వెళ్లే ముందు కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదంటే గుండె పగలడమే కాదు.. జేబుకి పెద్ద చిల్లేపడుతుంది.