...
...
Next Story

వాట్సాప్‌‌లోనూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.. మీ సేవలో కూడా!

క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. మీ సేవ ద్వారా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jul 21, 2026, 15:02:38 IST
Advertisement

హైదరాబాద్ (కోర్ అర్బన్ రీజియన్ - CURE) పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అందుబాటు ధరల్లో నిర్మించే ఫ్లాట్ల కోసం దరఖాస్తు ప్రక్రియ (జూలై 21, 2026) నుంచి 'మీసేవ' పోర్టల్‌లో ప్రారంభమైంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10, 2026ని తుది గడువుగా నిర్ణయించారు.

ఇందిరమ్మ ఇళ్ల వివరాలు

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతి ఫ్లాట్ బిల్ట్-అప్ ఏరియా 528 చదరపు అడుగులు (sft) కాగా, కార్పెట్ ఏరియా 400 చదరపు అడుగులుగా ఉంటుంది. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ అంచనా వ్యయం రూ. 11 లక్షలు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 5 లక్షల సబ్సిడీని అందిస్తుంది. సబ్సిడీ మినహాయించి, లబ్ధిదారుడు మిగిలిన రూ. 6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. భూమి కూడా ప్రభుత్వం చూపిస్తుంది. వార్షిక కుటుంబ ఆదాయం రూ. 6 లక్షల వరకు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.

ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అభ్యర్థులు నేరుగా మీసేవ కేంద్రాల ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్ (meeseva.telangana.gov.in)లో దేరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా కూడా సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మీసేవ పోర్టల్‌లో ముందుగా రిజిస్టర్ అయి, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత 'Others' విభాగంపై క్లిక్ చేయాలి. అనంతరం 'TSHB' ట్యాబ్‌ను ఎంచుకుంటే అక్కడ 'Indiramma Indlu CURE Area', 'LIG Flats Application Form' ఆప్షన్లు కనిపిస్తాయి.

దరఖాస్తుదారు పేరు, పుట్టిన తేదీ, వార్షిక రాబడి, వార్డు, సర్కిల్, ప్రాజెక్టు ప్రాంతం వివరాలు ఇవ్వాలి. అధికారిక గుర్తింపు కార్డు, దాని ముందు, వెనుక భాగాల స్పష్టమైన చిత్రాలను (JPG ఫార్మాట్‌లో) అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలకు మించకూడదు.

ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తారు. హైదరాబాద్‌లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణ ప్రాంతాలను గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మిగిలిన 10 నియోజకవర్గాల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe