హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ స్కైవాక్ వద్ద గురువారం రాత్రి ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. స్కైవాక్ పైనుంచి కిందకు దిగుతున్న క్రమంలో సాంకేతిక లోపంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో, ఒక యువకుడు దాదాపు రెండు గంటల పాటు లోపలే చిక్కుకుపోయి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. నిజం చెప్పాలంటే నరకం చూశాడు అనుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు నిర్మించిన ఈ స్కైవాక్ వద్ద నిర్వహణ లోపాలు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయనే దానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌లో రాహుల్ అనే 20 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రాహుల్ గురువారం రాత్రి తన డ్యూటీ ముగించుకుని హాస్టల్‌కు తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఉప్పల్ ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న స్కైవాక్ ఎక్కాడు. అనంతరం రోడ్డు దాటిన తర్వాత కిందికి దిగడం కోసం స్కైవాక్ లిఫ్ట్‌ను ఉపయోగించాడు.
అయితే, లిఫ్ట్ కిందకు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తి, అది మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో ఆ యువకుడు లిఫ్ట్ లోపలే చిక్కుకుపోయాడు. గాలి ఆడక, లోపల చీకటిగా మారడంతో రాహుల్ తీవ్ర భయాందోళనతో కేకలు వేశాడు. చాలాసేపు నరకం చూశాడు.
లిఫ్టులో యువకుడు చిక్కుకున్న విషయమై సమాచారం అందుకున్న వెంటనే ఉప్పల్ పోలీసులు, హైడ్రా అధికారులు మరియు అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోపల ఉన్న యువకుడికి ధైర్యం చెబుతూనే, లిఫ్ట్ తలుపులు తెరిచేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ అనంతరం.. అర్ధరాత్రి దాటాక సుమారు 1:15 గంటల సమయంలో ఒక టెక్నీషియన్ సహాయంతో లిఫ్ట్ డోర్లను విజయవంతంగా తెరిచారు. రాహుల్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ మెయింటెనెన్స్ బాధ్యతలు చూసే కృష్ణ కన్స్ట్రక్షన్స్ సిబ్బందితో పాటు హెచ్ఎండీఏ అధికారులు సకాలంలో స్పందించలేదని ఆరోపణలు వస్తున్నాయి. వారి నిర్లక్ష్యం వల్లే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందని, యువకుడు ఎక్కువ సమయం నరకయాతన అనుభవించాల్సి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే స్కైవాక్ లిఫ్టుల భద్రతపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
{{/usCountry}}ఈ ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ మెయింటెనెన్స్ బాధ్యతలు చూసే కృష్ణ కన్స్ట్రక్షన్స్ సిబ్బందితో పాటు హెచ్ఎండీఏ అధికారులు సకాలంలో స్పందించలేదని ఆరోపణలు వస్తున్నాయి. వారి నిర్లక్ష్యం వల్లే రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమైందని, యువకుడు ఎక్కువ సమయం నరకయాతన అనుభవించాల్సి వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే స్కైవాక్ లిఫ్టుల భద్రతపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
{{/usCountry}}