ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 4 ఎపిసోడ్: లాకప్‌లో ధీరజ్‌పై లాఠీచార్జ్- ప్రేమను లాక్కెళ్లిన పోలీసులు- అక్కా తమ్ముడి సంబురం!
Illu Illalu Pillalu Serial June 4th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ జూన్ 4వ ఎపిసోడ్‌లో డ్రగ్స్ కేసులో పోలీసులు ధీరజ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. లాకప్‌లో పోలీసులు కొడతారు. అది చూసిన ప్రేమ నిలదీస్తుంది. మరోవైపు సుకున్న, శ్రీవల్లి రీల్స్ వీడియోలు చేస్తుంటారు.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్, ప్రేమ కారులో వెళ్తుంటారు. పోలీసులు కాపుకాచుకుని ఉంటారు. పోలీసులు పెట్టిన వ్యక్తి ధీరజ్ కారు రాగానే ఆపుతాడు. ధీరజ్ కారు ఆపి తిడతాడు. ఇవి అర్జంట్‌గా డెలివరీ చేయాలని, అరగంట నుంచి ఎవరు ఆపట్లేదని, ఇదే రూట్‌లో లక్ష్మీ నరసింహ నగర్‌లో దిగుతాను. కాస్తా డ్రాప్ చేయమని అంటాడు అతను.

డెలివరీ జాబ్ పోతుందని
ధీరజ్ ఒప్పుకోకుంటే.. డెలివరీ జాబ్ పోతుందని, చాలా కష్టం అవుతుందని వేడుకుంటాడు. డెలివరీ జాబ్ అన్నావుగా, ఆ కష్టాలు ఏంటో నాకు తెలుసు అని ధీరజ్ ఒప్పుకుంటాడు. బాక్సులను ఓపెన్ చేయమని ధీరజ్ అంటాడు. మామిడి కాయలు మాత్రమే ఉన్నాయని తీసి చూపిస్తాడు. ధీరజ్ చూసి సరేనని కారు ఎక్కమంటాడు. తర్వాత కారును పోలీసులు ఆపుతారు.
యాక్టింగ్ బాగా చేస్తున్నావ్
కారు చెక్ చేయాలని చెప్పి చెక్ చేస్తారు. మామిడి కాయలు ఉన్న బాక్సులో డ్రగ్స్ దొరుకుతుంది. ఇవి అతనివి అని ధీరజ్ చూపిస్తాడు. కానీ, అతను ఉండడు. దాంతో ధీరజ్ కంగారుపడతాడు. యాక్టింగ్ బాగా చేస్తున్నావ్. పదా పోలీస్ స్టేషన్‌కు అని ఎస్సై అంటాడు. దాంతో దారిలో జరిగిందని ధీరజ్, ప్రేమ చెబుతారు.
కానిస్టేబుల్స్ లాఠీచార్జ్
మామిడి కాయలు పేరుతో మాదక ద్రవ్యాలు అమ్ముతూ కథలు చెబుతున్నారా అని ధీరజ్ ఒక్కడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు పోలీసులు. రోడ్డు మీద ప్రేమ తలపట్టుకుని ఏడుస్తుంది. పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో ధీరజ్‌ను కానిస్టేబుల్స్ కొడుతూ లాఠీచార్జ్. అదంతా ఎస్సై వీడియో తీసి భద్రావతి, సేనాపతికి పంపిస్తాడు. అది చూసి అక్కా తమ్ముడు తెగ సంబరపడిపోతారు.
పోలీసులను నిలదీసిన ప్రేమ
ఇన్నాళ్లకు వాడిమీదున్న కోపం, పగ కొంతవరకు అయిన తీరిందని సేనాపతి అంటాడు. పోలీస్ స్టేషన్‌కు ప్రేమ వెళ్లి పోలీసులను అడ్డుకుంటుంది. అదంతా కూడా భద్రావతి, సేనాపతి చూస్తారు. డ్రగ్స్ సప్లై చేయడం చూశారా అని పోలీసులను నిలదీస్తుంది ప్రేమ. ఇంటికెళ్లమని ధీరజ్ అంటాడు. అన్యాయంగా కొడుతున్నారని ప్రేమ అంటుంది.
శ్రీవల్లి, సుకన్య రీల్స్
నా మేనకోడలిని అక్కడి నుంచి పంపించేయండి అని ఎస్సైతో అంటుంది భద్రావతి. లేడి కానిస్టేబుల్స్‌తో ప్రేమను లాకప్ నుంచి బయటకు పంపిస్తాడు ఎస్సై. ప్రేమను లాక్కెళ్తారు పోలీసులు. బయట ప్రేమ ఉంటుంది. లాకప్‌లో ధీరజ్ ఉంటాడు. మరోవైపు శ్రీవల్లి, సుకన్య ఇద్దరు రీల్స్ చేస్తుంటారు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు.
పుట్టేబిడ్డకు మంచిదని
అది నర్మద చూస్తుంది. నర్మదను చూసి సుకన్య ఆగిపోతుంది. నర్మద వచ్చిందని తెలిసి శ్రీవల్లి షాక్ అయి ఆగిపోతుంది. నువ్వు నిజంగానే కడుపుతో ఉన్నావా. జాగ్రత్తగా ఉండకుండా కల్లు తాగిన కోతిలా గెంతుతుంటే డౌట్ వచ్చిందని అని నర్మద అడుగుతుంది. ఇది ఎరోబిక్స్. కడుపుతో ఉన్నవాళ్లు ఇలా చేస్తే పుట్టేబిడ్డకు మంచిదని సుకన్య కవర్ చేస్తుంది.
వేదవతి చిర్రుబుర్రులు
రీల్స్ వల్ల వచ్చే ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుంటారు. ఎస్సై కోచింగ్ వెళ్లిన ధీరజ్ వాళ్లు ఇంకా రాలేదు ఏంటీ అని గుర్తుకు వచ్చి వెళ్లిపోతుంది నర్మద. రామరాజు ఏదో రాసుకుంటే వేదవతి వచ్చి కాఫీ ఇస్తుంది. ఏంటీ చిర్రుబుర్రులు ఆడుతున్నావని రామరాజు అడుగుతాడు. అంతలో సాగర్ వస్తాడు. ధీరజ్ గురించి గొప్పగా చెబుతాడు. కారుకు డబ్బులు కూడా తీసుకోలేదని అంటాడు.
ఫోన్లు సీజ్
వాన్ని చూసి బుద్ధి తెచ్చుకుని కొంతమంది బాగుపడాలని రామరాజు అంటాడు. ధీరజ్‌కు నర్మద కాల్ చేస్తుంది. అది చూసిన లేడి కానిస్టేబుల్ వీళ్ల ఫోన్లు సీజ్ చేశాం. ఇంట్లోవాళ్లు కాల్ చేస్తున్నారు అని సైలెంట్‌గా వెళ్లి ప్రేమకు ఇస్తుంది. దాంతో నర్మదకు జరిగింది, ధీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్‌లో ఉన్న విషయం ఏడుస్తూ చెబుతుంది ప్రేమ.
రామరాజు కుటుంబం షాక్
భయపడకు ఇప్పుడే వస్తున్నా అని కంగారుగా వెళ్తుంది నర్మద. ఇంట్లోకి వెళ్లి ధీరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


