Yuva Bharat Run 2026 : హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ ”

Yuva Bharat Run 2026 in Hyderabad : హైదరాబాద్ వేదికగా  ‘యువ భారత్ రన్ - 2026’ను ఘనంగా నిర్వహించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు.

Published on: Mar 29, 2026, 10:26:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం “యువ భారత్ రన్ 2026” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS), పల్లవి స్కూల్స్ సంయుక్తంగా ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఆధ్వర్యంలో ఈ రన్ కార్యక్రమం తలపెట్టారు.

హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”
హైదరాబాద్‌లో ఘనంగా “యువ భారత్ రన్ 2026”

ఈ యువ భారత్ రన్ దేశంలోనే అతిపెద్ద యువత ఆధారిత ఫిట్‌నెస్ ఉద్యమంగా నిలిచింది. 10,000 మందికి పైగా విద్యార్థులు, కుటుంబ సభ్యులు, యువ ప్రొఫెషనల్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ రన్‌కు ఫిట్ ఇండియా, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మద్దతు అందించింది. రెడ్ ఎఫ్‌ఎమ్ అధికారిక రేడియో భాగస్వామిగా వ్యవహరించింది. ఈ కార్యక్రమం యువతలో ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలిచింది.

ఈ రన్‌లో 5 కిలోమీటర్ల “ది ఛాలెంజ్” (టైమ్‌డ్ రన్), 2 కిలోమీటర్ల “రన్ అండ్ బాండ్” (కుటుంబ సభ్యులు, ప్రారంభికుల కోసం), 500 మీటర్ల “యంగ్ రన్నర్స్” (చిన్నారుల కోసం) వంటి విభాగాలు ఏర్పాటు చేశారు. అన్ని వయసుల వారికి అనుకూలంగా ఈ విభాగాలు ఉండటం విశేషం.

రన్‌తో పాటు జుంబా, యోగా వార్మప్ సెషన్స్, హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్, ప్లే జోన్స్, ఫుడ్ స్టాల్స్, గేమ్స్ వంటి వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టైమ్‌డ్ కేటగిరీల్లో విజేతలకు మొత్తం రూ.1 లక్ష నగదు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా , మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు సినీ నటుడు శర్వానంద్ హాజరయ్యారు. జెండా ఊపి 2కే, 5కే రన్‌ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులను ప్రోత్సహించారు.

వ్యాయామం చేయాలి - వెంకయ్య నాయుడు

ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… యువతలో విదేశీ అలవాట్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ తమ మాతృభాషలో మాట్లాడాలని కోరారు. తల్లిదండ్రులతో సమయం గడపడం, ఉదయం త్వరగా లేవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లు అలవరుచుకోవాలని సూచించారు. ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరమని, “ఇన్‌స్టంట్ ఫుడ్ అంటే కాన్స్టంట్ డిసీజ్” అని వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా వినియోగంపై కూడా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఉపయోగించాలని పిలుపునిచ్చారు. లేదంటే ఏకాగ్రత తగ్గి ఆందోళనలు పెరుగుతాయని హెచ్చరించారు. మంచి ప్రవర్తన, క్రమశిక్షణతో జీవనం సాగించాలని, కుటుంబ సభ్యులతో కలిసి సమస్యలను చర్చించి పరిష్కారం కనుగొనాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.

భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని వెంకయ్య నాయుడు చెప్పారు. “వాక్ అండ్ కండక్ట్” అనే సందేశాన్ని యువతకు అందిస్తూ… నడక ఆరోగ్యానికి, ప్రవర్తన భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమని తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More