సంక్రాంతి సంబురాలు.. గోదావరి జిల్లాల్లో హోటళ్లు హౌస్‌ ఫుల్!

సంక్రాంతి అనగానే ఠక్కున గుర్తొచ్చేది గోదావరి జిల్లాలు. ఒక్కసారైనా సంక్రాంతికి ఇక్కడకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు అలానే వెళ్లడంతో హోటళ్లు ఫుల్ అయ్యాయి.

Published on: Jan 14, 2026, 15:10:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలకు వెళ్లాలి అనుకునేవారు చాలా మంది ఉంటారు. కోడి పందేల కోసమే ఇక్కడకు వస్తుంటారు. అందుకు తగ్గట్టే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏర్పాట్లు కూడా ఉంటాయి. వేరే రాష్ట్రాల నుంచి కూడా సంక్రాంతి సంబురాలకు ఇక్కడకు జనాలు వస్తుంటారు. దీంతో హోటళ్లు కిక్కిరిసిపోతాయి. అంతేకాదు హోటల్ యజమానులు రేట్లను డబుల్ చేసి బస చేసేందుకు ఇస్తున్నారు. అయినా కూడా జనాలు అద్దెకు తీసుకుంటున్నారు.

కోడి పందేలు (@Allaboutindia28)
కోడి పందేలు (@Allaboutindia28)

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యంగా భీమవరం సంక్రాంతి ఉత్సవాలకు అలాగే కోడి పందేలకు ప్రధాన కేంద్రం అని చెప్పవచ్చు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాల నుండి చాలా మంది తమ బంధువులు, స్నేహితుల ఇళ్లకు వచ్చారు. కొందరు గోదావరి జిల్లాల్లో ఉన్న హోటళ్లలో బస చేస్తున్నారు. భీమవరంలోని అన్ని హోటళ్ళు పూర్తిగా బుక్ అయ్యాయి. గదులు అందుబాటులో లేవు. కొంతమంది అపార్ట్‌మెంట్ యజమానులు మూడు రోజుల ప్యాకేజీకి రూ.30,000 నుండి రూ.50,000 వరకు వసూలు చేయడం ద్వారా సందర్శకులకు వసతి కల్పించారు. కొందరు భోజనం ఏర్పాట్లను కూడా చేశారు.

భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రిలాంటి ప్రాంతాల్లో హోటళ్లలో ఒక్క గది కూడా ఖాళీగా లేదు. తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఆంధ్రాకు వెళ్లారు. సంక్రాంతి కోడి పందేలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.1000 నుంచి రూ.5000 వరకు ఉండే గది అద్దెను సంక్రాంతి పండుగ సందర్భంగా పెంచేశారు యజమానులు. మూడు రోజులకు రూ.30 నుంచి రూ.50 వరకు తీసుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబురాలకు వచ్చిన టూరిస్టులు.. అడిగిన అద్దెను చెల్లిస్తున్నారు. హోమ్ స్టేలు సైతం ప్లాన్ చేశారు.

హోటళ్లలో గదులు దొరక్క.. టూరిస్టులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రైవేట్ ఇళ్లు, కళ్యాణ మండపాల్లో ఉంటున్నారు. ఇక్కడ కూడా రేట్లు ఎక్కువే ఉన్నాయి. భీమవరంలో కోడి పందేలు ఎక్కువగా జరుగుతాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు సైతం ఇక్కడకు వస్తుంటారు. దీంతో హోటళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈసారి కోడిపందేలకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు హోటళ్లు హౌస్ ఫుల్ అయిపోయాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More