Andhra Pradesh Assembly Sessions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సోమవారం (ఆగస్టు 17) నుంచి చట్టసభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

అమరావతిలోని వెలగపూడి వద్ద గల అసెంబ్లీ భవనంలో సోమవారం ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక శాసనమండలి భవనంలో ఉదయం 10 గంటలకు మండలి సమావేశాలు కొలువుదీరనున్నాయని రాజ్ భవన్ జారీ చేసిన ప్రకటనలో అధికారులు వెల్లడించారు. ఈ రాబోయే సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవలనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు సభ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు రాబోతున్నారా..?
తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను చట్టసభల వేదికగా ఎండగట్టాలని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ పార్టీ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఆగస్టు 12న నిర్వహించిన సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడారు. ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పూర్తి డేటాతో సభకు వచ్చి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సభలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉన్నప్పటికీ, తమకు 'ప్రతిపక్ష నేత' హోదా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిరాకరిస్తోందని జగన్ తీవ్రంగా ఆరోపించారు. విపక్షం గొంతు నొక్కేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని, అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పులను మీడియా ద్వారా ప్రజలకు నిరంతరం వివరిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాల్లో చోటుచేసుకున్నాయంటున్న అక్రమాలు, ఔట్‌సోర్సింగ్ నియామకాల స్కామ్‌లు, ఇతర ప్రజా సమస్యలపై సభలో తీవ్రంగా నిలదీయాలని జగన్ తమ శాసనసభ్యులను ఆదేశించారు. ఈ అంశాలపై చర్చకు పట్టుబట్టాలని దిశా నిర్దేశం చేశారు.
అలాగే రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర (MSP) లభించడం లేదని, సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేయడం వల్ల రైతాంగం మరింత నష్టపోయిందని, ఈ సమస్యలను సభలో గట్టిగా వినిపించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ
శాసనసభలో తమ పార్టీ సభ్యులు కొద్దిమందే ఉన్నప్పటికీ… శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి పూర్తి మెజారిటీ ఉందనే విషయాన్ని జగన్ గుర్తుచేశారు. ప్రజల గొంతుకగా మారి ప్రతి సమస్యను మండలి వేదికగా గట్టిగా లేవనెత్తాలని ఎమ్మెల్సీలకు సూచించారు.
{{/usCountry}}శాసనసభలో తమ పార్టీ సభ్యులు కొద్దిమందే ఉన్నప్పటికీ… శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి పూర్తి మెజారిటీ ఉందనే విషయాన్ని జగన్ గుర్తుచేశారు. ప్రజల గొంతుకగా మారి ప్రతి సమస్యను మండలి వేదికగా గట్టిగా లేవనెత్తాలని ఎమ్మెల్సీలకు సూచించారు.
{{/usCountry}}అయితే… వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం మండలి సమావేశాలకు హాజరు కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
సభలో బలాబలాలు ఇవే:
- శాసనమండలి (మొత్తం 58 స్థానాలు ): వైఎస్‌ఆర్‌సీపీ 32, టీడీపీ 10, ఇండిపెండెంట్లు 5, నామినేటెడ్ 6, జనాసేన 2, బీజేపీ 1 కాగా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
- శాసనసభ (మొత్తం 175 స్థానాలు) : టీడీపీ 135, జనసేన 21, వైఎస్‌ఆర్‌సీపీ 11, బీజేపీ 8 స్థానాలను కలిగి ఉన్నాయి.