AP Govt : ఎక్కువ మంది పిల్లలు కనే దంపతులకు రూ. 25 వేలు - ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ..!

పాపులేషన్ మేనేజ్మెంట్ పై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక  ప్రకటన చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాలసీ అమలు చేస్తామన్నారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలోనే రూ.25 వేలు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. 

Published on: Mar 05, 2026 9:28 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా నియంత్రణకు చెప్ పెట్టే పనిలో పడింది. రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (TFR) భవిష్యత్తులో మానవ వనరుల కొరతకు దారితీస్తుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు.

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు (ఫైల్ ఫొటో)
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు (ఫైల్ ఫొటో)

రూ. 25 వేల నగదు…

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ప్రభుత్వం రూ. 25,000 నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీని అమలు చేస్తామని తెలిపారు. మూడో సంతానం, ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్ ఇస్తామన్నారు. తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని సభలో తెలిపారు.

“ 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా 23 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం. రాష్ట్రంలో 1.5గా ఉన్న టోటల్ ఫెర్టిలిటీ రేట్ ను 2.1కు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ పేరిట డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రతిపాదన చేస్తున్నాం. మూడో సంతానానికి 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం. ప్రజల అందరి అభిప్రాయం తీసుకునేందుకు గానూ ఆన్‌లైన్‌లో ‘పాపులేషన్ మేనేజ్మెంట్’ పాలసీ డాక్యుమెంట్ ఉంచుతాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ఏప్రిల్ 1 నుంచి అమలు…!

ఈ నెలాఖరు కల్లా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీకి తుదిరూపం ఇచ్చి ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. “దేశంలోనే ఇది తొలి పాపులేషన్ మేనేజ్మెంట్. వృద్ధుల సంరక్షణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 175 సీహెచ్‌సీలలో రెండు వారాలకు ఒకసారి ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తాం. సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ ద్వారా 50,000 రిటైర్డ్ ప్రొఫెషనల్స్‌ను మెంటరింగ్‌లో భాగం చేస్తాం. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో భాగంగా చైల్డ్ కేర్ టేకర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం” అని తెలిపారు.

రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు డిజిటల్ నెర్వ్ సిస్టమ్ ను ప్రాజెక్ట్ సంజీవని పేరిట రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 71 లక్షల హై-రిస్క్ కేసుల గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. 5.2 కోట్ల ప్రజల హెల్త్ రికార్డ్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వివరించారు.

“రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షీ క్యాబ్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం. విశాఖపట్నంలో రూ.172 కోట్లతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ నిర్మాణం చేపడుతున్నాం. ఏ ప్రాంతంలో మహిళా ఉద్యోగులు పనిచేస్తారో అక్కడ కొత్తగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More