AP AEE Recruitment : 630 ఏఈఈ ఉద్యోగాలు - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ! వెంటనే అప్లయ్ చేసుకోండి

AP AEE Recruitment 2026 : ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల (AEE) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు సోమవారం(జూలై 20) రాత్రి 11.59 గంటలతో ముగియనుంది. మొత్తం 630 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

Published on: Jul 20, 2026, 07:43:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP AEE Recruitment 2026 : రాష్ట్రంలోని పలు విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 630 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ప్రక్రియ తుది దశకు చేరింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళ ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయా విద్యుత్ సంస్థల అధికారులు సూచిస్తున్నారు.

విద్యుత్తు సంస్థల్లో ఏఈఈ ఉద్యోగాలు (REUTERS)
విద్యుత్తు సంస్థల్లో ఏఈఈ ఉద్యోగాలు (REUTERS)

మొత్తం 630 ఖాళీలు…

రాష్ట్రంలోని విద్యుత్ నియంత్రణ సంస్థలైన ట్రాన్స్‌కో (Transco), జెన్‌కో (Genco), విధ డిస్కంల (Discoms) పరిధిలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల (AEE) పోస్టుల భర్తీకి ఇటీవలనే వేర్వురు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అన్ని కలిపి 630 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం(జూలై 20) రాత్రి 11.59 గంటలతో గడువు ముగియనుందని సీపీడీసీఎల్‌ (CPDCL) సీఎండీ పుల్లారెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో సర్వర్లపై ఒత్తిడి పెరిగి సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున… అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలని అధికారులు పేర్కొన్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో తప్పనిసరిగా బీఈ (B.E) లేదా బీటెక్ (B.Tech) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన ప్రతిభ (మెరిట్), ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా పారదర్శకంగా తుది ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది.

అన్ని పోస్టులకూ విడతల వారీగా 22.08.2026 నుంచి 29.08.2026 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 47 ప్రాంతాలతోపాటు హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బెర్హంపుర్‌ (ఒడిశా)లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు https://apvidyutrecruitment.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

సంస్థల వారీ ఖాళీలు :

  • ఏపీ ట్రాన్స్‌కో - 200 పోస్టులు
  • ఏపీ జెన్‌కో - 100 పోస్టులు
  • ఏపీఈపీడీసీఎల్‌ - 135 పోస్టులు
  • ఏపీఎస్‌పీడీసీఎల్‌ - 135 పోస్టులు
  • ఏపీసీపీడీసీఎల్‌ - 60 పోస్టులు
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More