AP CM Chandrababu Delhi Visit : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం ఎయిర్‌పోర్ట్) ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.
ఆగస్టు 1న ప్రారంభోత్సవం

భోగాపురం విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన వైభవంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రధాని మోదీ పాల్గొని ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు.
ఢిల్లీ పర్యటన షెడ్యూల్
నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సీఎం చంద్రబాబు జులై 22 బుధవారం ఉదయం 7:30 గంటలకు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటారు. రోజంతా రాజధానిలో పలు కీలక భేటీల్లో పాల్గొంటారు. బుధవారం రాత్రికి ఢిల్లీలోనే బస చేసి…. మరుసటి రోజు అంటే జులై 23 గురువారం ఉదయం 10:20 గంటలకు తిరిగి అమరావతికి చేరుకుంటారు.
ప్రధాని మోదీతో భేటీతో పాటు, కేంద్ర మంత్రివర్గంలోని పలువురు ప్రముఖులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు.
ఈ భేటీలలో రాష్ట్రానికి సంబంధించిన పలు సంక్షేమ, అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉంది. పెండింగ్ నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అందుతున్న రుణాల ప్రక్రియ వేగవంతం, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఖరారు , నిధుల రీయింబర్స్మెంట్ వంటి అంశాలు చర్చకు రావొచ్చు.
{{/usCountry}}ఈ భేటీలలో రాష్ట్రానికి సంబంధించిన పలు సంక్షేమ, అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల విడుదలపై చర్చించే అవకాశం ఉంది. పెండింగ్ నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అందుతున్న రుణాల ప్రక్రియ వేగవంతం, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఖరారు , నిధుల రీయింబర్స్మెంట్ వంటి అంశాలు చర్చకు రావొచ్చు.
{{/usCountry}}ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం…. ఉత్తరాంధ్ర ప్రాంతానికి రవాణా, వ్యాపార కేంద్రంగా మారబోతుందని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. "ఈ ఎయిర్‌పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా మారుతుంది. అంతర్జాతీయ స్థాయిలో కనెక్టివిటీ పెరిగి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేస్తుంది. పారిశ్రామికంగా, పర్యాటకంగా ఈ ప్రాంతం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది," అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అమరావతి, విశాఖపట్నంతో పాటు సమీప జిల్లాలకు విదేశీ పెట్టుబడులు, పర్యాటకం పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.