ఏపీ అన్నదాత సుఖీభవ స్కీమ్ : రైతులకు శుభవార్త... ఇవాళ ఒక్కొక్కరికి రూ.7 వేలు జమ, మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
రాష్ట్రంలోని రైతులకు ఇవాళ అన్నదాత సుఖీభవ నిధులు జమ కానున్నాయి. కడప జిల్లా నుంచి రెండో విడత కింద సీఎం చంద్రబాబు నిధులను విడుదల చేయనున్నారు. ఈ విడతలో 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్లను జమ చేస్తారు.
ఇవాళ శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 9.25 నిముషాలకు పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రధాని మోదీతో కలిసి శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. 10 గంటలకు సాయి కుల్వంత్ హాల్లో భగవాన్ శ్రీసత్యసాయి మహా సమాధిని ఇరువురు నేతలు దర్శించుకోనున్నారు.

ఆ తర్వాత శ్రీసత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే శతజయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు హాజరు అవుతారు. ప్రధాని మోదీకి వీడ్కోలు పలికిన అనంతరం 1.15 గంటలకు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రికి సీఎం చేరుకోనున్నారు. స్థానికంగా గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి అనంతరం రైతులతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు.
రైతుల ఖాతాలోకి నిధులు…
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం రెండవ విడతలో రూ.7 వేల చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాలకు రూ.3,135 కోట్లను జమ చేయనుంది. ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా రూ.7 వేలను ప్రభుత్వం జమ చేసింది. రేపు రెండో విడతగా మరో రూ.7 వేల చొప్పున రైతులకు ప్రభుత్వం జమ చేయనుంది. రెండు విడతల్లో మొత్తంగా రూ.6,309.44 కోట్ల మేర ఆర్ధిక ప్రయోజనం రైతులకు కలుగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం స్థానిక కేడర్ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం రాత్రికి అమరావతికి రానున్నారు.
అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లోకి వెళ్లి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. హోంపేజీలో కనిపింటే 'Know Your Status' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. పక్కనే ఉండే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ ప్లే అవుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

