AP EAPCET 2026 Counselling : ఏపీ ఈఏపీసెట్ - 2026 కౌన్సెలింగ్ కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ వివరాలను నమోదు(రిజిస్ట్రేషన్) చేసుకునేందుకు ఇవాళ్టి గడువు (జూలై 29) ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in/ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు:
- విద్యార్థులు జులై 29వ తేదీ లోగా అధికారిక పోర్టల్‌లో తమ ప్రొఫైల్ నమోదు చేసుకుని…. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాల (సర్టిఫికెట్లు) పరిశీలన జులై 31వ తేదీతో పూర్తవుతుంది.
- సర్టిఫికెట్ల పరిశీలన విజయవంతంగా పూర్తయిన విద్యార్థులు జులై 31వ తేదీ వరకు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవచ్చు.
- ఒకవేళ వెబ్ ఆప్షన్లు నమోదు చేసిన తర్వాత ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే, అభ్యర్థుల కోసం ఆగస్టు 1వ తేదీన ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు.
- విద్యార్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్లు, ఈఏపీసెట్ ర్యాంకు మెరిట్ , వర్తించే రిజర్వేషన్ నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని ఆగస్టు 6వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.
- ఈ ఫలితాలను కూడా https://cap.apcfss.in / వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
- మొదటి విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 7వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ లోపు తమకు కేటాయించిన కళాశాలలకు స్వయంగా వెళ్లి సెల్ఫ్ జాయినింగ్ మరియు డాక్యుమెంట్ సబ్మిషన్ ద్వారా రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

{{^htLoading}} {{/htLoading}}
నిర్ణీత గడువులోగా కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయని విద్యార్థుల సీటును ఆటోమేటిక్‌గా రద్దు చేస్తారు. కాబట్టి ప్రవేశం పొందాలనుకునే వారు తప్పనిసరిగా కేటాయించిన సమయంలోనే రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇక 2026-27 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజినీరింగ్ తరగతులు ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}