ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - నేటితో రిజిస్ట్రేషన్ల గడువు ముగింపు, వెంటనే ప్రాసెస్ చేసుకోండి

AP EAPCET 2026 Counselling : ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ 2026 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. ఆగస్టు 6వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

Published on: Jul 29, 2026, 17:09:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP EAPCET 2026 Counselling : ఏపీ ఈఏపీసెట్ - 2026 కౌన్సెలింగ్ కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ వివరాలను నమోదు(రిజిస్ట్రేషన్) చేసుకునేందుకు ఇవాళ్టి గడువు (జూలై 29) ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అధికారిక వెబ్‌సైట్ https://cap.apcfss.in/ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2026
ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2026

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు:

  • విద్యార్థులు జులై 29వ తేదీ లోగా అధికారిక పోర్టల్‌లో తమ ప్రొఫైల్ నమోదు చేసుకుని…. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, అప్‌లోడ్ చేసిన ధ్రువపత్రాల (సర్టిఫికెట్లు) పరిశీలన జులై 31వ తేదీతో పూర్తవుతుంది.
  • సర్టిఫికెట్ల పరిశీలన విజయవంతంగా పూర్తయిన విద్యార్థులు జులై 31వ తేదీ వరకు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవచ్చు.
  • ఒకవేళ వెబ్ ఆప్షన్లు నమోదు చేసిన తర్వాత ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే, అభ్యర్థుల కోసం ఆగస్టు 1వ తేదీన ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు.
  • విద్యార్థులు ఎంచుకున్న వెబ్ ఆప్షన్లు, ఈఏపీసెట్ ర్యాంకు మెరిట్ , వర్తించే రిజర్వేషన్ నిబంధనలను ప్రామాణికంగా తీసుకుని ఆగస్టు 6వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.
  • ఈ ఫలితాలను కూడా https://cap.apcfss.in / వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
  • మొదటి విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 7వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ లోపు తమకు కేటాయించిన కళాశాలలకు స్వయంగా వెళ్లి సెల్ఫ్ జాయినింగ్ మరియు డాక్యుమెంట్ సబ్మిషన్ ద్వారా రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

నిర్ణీత గడువులోగా కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయని విద్యార్థుల సీటును ఆటోమేటిక్‌గా రద్దు చేస్తారు. కాబట్టి ప్రవేశం పొందాలనుకునే వారు తప్పనిసరిగా కేటాయించిన సమయంలోనే రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇక 2026-27 నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజినీరింగ్ తరగతులు ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More