ఏపీలో పదో తరగతి పరీక్షలకు సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 16వ తేదీ నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. ఈ పరీక్షల కోసం విద్యార్థులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. విద్యార్థుల నామినల్ రోల్స్‌లో వివరాల సవరణలకు అవకాశం కల్పించింది.
ఈ నెల 28 వరకు ఛాన్స్….

విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాల్లో దొర్లిన తప్పులను వెంటనే సవరించుకోవాలని విద్యాశాఖ పేర్కొంది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గతంలోనే నామినల్ రోల్స్ లో సవరణకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. దాదాపుగా 9 వేల మందికిపైగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. తద్వారా విద్యార్థులు తప్పుగా ఉన్న వివరాలను సరిచేసుకోగలిగారు. అయితే తాజాగా ఇచ్చిన అవకాశంతో ఇంకా ఏవరైనా విద్యార్థులు ఉంటే వెంటనే వివరాలను ఎడిట్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ఆలస్యం చేయవద్దని… నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో ఇబ్బందుసు ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు.
మార్చి 16 నుంచి పరీక్షలు
మరోవైపు పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. మార్చి 16న ప్రారంభమై… ఏప్రిల్ ఒకటితో ముగుస్తాయి. హాల్ టికెట్లు మార్చి మొదటి వారంలో విడుదల కానున్నాయి. వీటిని అధికారిక వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 20వ తేదీన జరగబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్… మార్చి 21వ తేదీకి మారింది. మిగతా పరీక్షల పాత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
ఏపీ పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్…
- మార్చి 16, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18, 2026 – సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 21, 2026 - ఇంగ్లీష్
- మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
- మార్చి 25, 2026 – ఫిజిక్స్
- మార్చి 28, 2026 – బయాలజీ
- మార్చి 30 , 2026 – సోషల్ స్టడీస్
- మార్చి 31, 2026 – ఫస్ట్ లాంగ్వేజ్ (పేపర్ 2)
- ఏప్రిల్ 1, 2026 – ఒకేషనల్ కోర్సు.
ఏపీ టెన్త్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత…. పేపర్ వాల్యూయేషన్ ప్రారంభిస్తారు. మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత…. ఫలితాల విడుదలకు తేదీని ప్రకటిస్తారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ లో పొందొచ్చు.
{{/usCountry}}ఏపీ టెన్త్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత…. పేపర్ వాల్యూయేషన్ ప్రారంభిస్తారు. మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత…. ఫలితాల విడుదలకు తేదీని ప్రకటిస్తారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ లో పొందొచ్చు.
{{/usCountry}}