AP SSC Hall Ticket 2026 : ఏపీ టెన్త్ హాల్ టికెట్లు ఎప్పుడు..? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..?

Andhra SSC Exam Hall Ticket 2026 : ఏపీ పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 1వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తవుతాయి. మార్చి ఫస్ట్ వీక్ లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. 

Published on: Feb 25, 2026, 12:26:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. మార్చి 16న ప్రారంభమై… ఏప్రిల్‌ ఒకటితో ముగుస్తాయి. అయితే హాల్ టికెట్ల ఎప్పుడు వస్తాయని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…..

ఏపీ టెన్త్ పరీక్షలు
ఏపీ టెన్త్ పరీక్షలు

ఏపీ పదో తరగతి పరీక్షలు - హాల్ టికెట్లు ఎప్పుడు…?

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు మార్చి మొదటి వారంలో విడుదల కానున్నాయి. వీటిని అధికారిక వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 20వ తేదీన జరగబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్… మార్చి 21వ తేదీకి మారింది. మిగతా పరీక్షల పాత షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీ టెన్త్ పరీక్షలు - హాల్ టికెట్ డౌన్లోడ్ ఎలా..?

  • విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోని AP SSC Hall Ticket 2026 లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలను నమోదు చేయాలి.
  • డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

మనమిత్ర వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ ఎలా..?

  • ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా ఏపీ టెన్త్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ముందుగా 9552300009 వాట్సప్‌ నంబర్‌కు Hi అని మెసేజ్‌ సెండ్ చేయాలి.
  • ‘ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఏపీ టెన్త్ హాల్ టికెట్ ఆప్షన్ పై నొక్కాలి.
  • ఇక్కడ మీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

ఏపీ పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్…

  • మార్చి 16, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌
  • మార్చి 18, 2026 – సెకండ్‌ లాంగ్వేజ్‌
  • మార్చి 21, 2026 - ఇంగ్లీష్‌
  • మార్చి 23, 2026 – గణితం(మ్యాథ్స్)
  • మార్చి 25, 2026 – ఫిజిక్స్
  • మార్చి 28, 2026 – బయాలజీ
  • మార్చి 30 , 2026 – సోషల్‌ స్టడీస్‌
  • మార్చి 31, 2026 – ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (పేపర్‌ 2)
  • ఏప్రిల్‌ 1, 2026 – ఒకేషనల్‌ కోర్సు.

ఏపీ టెన్త్ పరీక్షలు పూర్తి అయిన తర్వాత…. పేపర్ వాల్యూయేషన్ ప్రారంభిస్తారు. మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత…. ఫలితాల విడుదలకు తేదీని ప్రకటిస్తారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ లో పొందొచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More