...
...
Next Story

AP Inter Exams 2026 : రేపట్నుంచే ఏపీ ఇంటర్ పరీక్షలు - నిమిషం నిబంధన అమలు..! ఎగ్జామ్ తేదీలు ఓసారి చెక్ చేసుకోండి

ఏపీ ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1537 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈసారి 10 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Published on: Feb 22, 2026 10:19 AM IST
Advertisement

రేపట్నుంచి(ఫిబ్రవరి 23) ఏపీ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,537 కేంద్రాలను సిద్ధం చేశారు. ఆయా సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టారు.

ఏపీ ఇంటర్ పరీక్షలు
ఏపీ ఇంటర్ పరీక్షలు

ఈ ఏడాది జరగబోయే ఇంటర్ పరీక్షలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 10,57,312 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. ఒక్క నిమిషం నిబంధనను అమలు చేయనున్నారు. కాబట్టి ఎక్కడా రిస్క్ తీసుకోకుండా విద్యార్థులు కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రతి పరీక్ష గదిలో సీసీ టీవీ కెమెరాల నిఘా వ్యవస్థ ఉంటుంది.మొబైల్స్, స్మార్ట్‌ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించరు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను, రూమర్లను నమ్మొద్దని ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది

అత్యవసర సమస్యల కోసం ఇంటర్ బోర్డు కార్యాలయంలో 1800 425 1531 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెంబర్ అందుబాటులో ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ షురూ అవుతాయి. మార్చి 24వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఎగ్జామ్ నిర్వహిస్తారు.

మరోవైపు పరీక్షల షెడ్యూల్ ను విద్యార్థులు చెక్ చేసుకోవాలని బోర్డు అధికారులు సూచించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగిన నేపథ్యంలో…. తేదీలను పక్కాగా చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… మార్చి 20వ తేదీన జరగాల్సిన ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1 ఎగ్జామ్స్ ను మార్చి 21వ తేదీకి మార్చారు. ఇక మార్చి 3వ తేదీన జరగాల్సిన సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2 పేపర్ పరీక్షలను మార్చి 4వ తేదీకి మార్చారు. మిగతా పరీక్షలు యథావిథిగానే ఉంటాయి.

ఏపీ ఇంటర్ 2026 - ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ :

  • ఫిబ్రవరి 23 - ఫస్ట్ ఇయర్ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1.
  • ఫిబ్రవరి 25 - ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 1.
  • ఫిబ్రవరి 27 - ఫస్ట్ ఇయర్ హిస్టరీ పేపర్ 1, బోటనీ పేపర్ 1.
  • మార్చి 2 - ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 1ఏ.
  • మార్చి 5 - ఫస్ట్ ఇయర్ జూవాలజీ/ మ్యాథ్స్ 1బి, జూవాలజీ పేపర్ 1.
  • మార్చి 7 - ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ 1.
  • మార్చి 10- ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ 1.
  • మార్చి 12 - ఫస్ట్ ఇయర్ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1.
  • మార్చి 14- ఫస్ట్ ఇయర్ సివిక్స్ 1.
  • మార్చి 17 - ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ 1.
  • మార్చి 21 - ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1.
  • మార్చి 24 - ఫస్ట్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1.

ఏపీ ఇంటర్ 2026 - సెకండ్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ :

  • ఫిబ్రవరి 24 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2.
  • ఫిబ్రవరి 26 - ఇంగ్లీషు పేపర్ 2.
  • ఫిబ్రవరి 28 - సెకండ్ ఇయర్ హిస్టరీ/ బోటనీ పేపర్ 2.
  • మార్చి 4 - సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2.
  • మార్చి 6 - సెకండ్ ఇయర్ జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2.
  • మార్చి 9- సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2బి.
  • మార్చి 11- సెకండ్ ఇయర్ ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2.
  • మార్చి 13- సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 2.
  • మార్చి 16 - సెకండ్ ఇయర్ మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2.
  • మార్చి 18 - సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 2.
  • మార్చి 23 - సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ -2.

ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబరు, ద్వితీయ సంవత్సరం వారు మొదటి సంవత్సరం హాల్‌ టికెట్‌ నంబరు లేదా ఆధార్‌ నంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక హాల్‌ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్, కళాశాల స్టాంప్‌ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా 9552300009 వాట్సప్‌ నంబర్‌కు Hi అని మెసేజ్‌ సెండ్ చేయాలి. ‘ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.ఇక్కడ మీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe