ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నగారా మోగించింది. పురపాలక, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వచ్చింది. 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఈ స్థానిక ఎన్నికలు మొదటి గ్రాస్రూట్ స్థాయి పరీక్షగా మారనున్నాయి.

శాసనసభ ఎన్నికల్లో పాటించిన అదే విజయవంతమైన పొత్తు సూత్రాన్ని స్థానిక సంస్థల్లోనూ కొనసాగించాలని కూటమి నిర్ణయించింది. అయితే గ్రామీణ, పట్టణ స్థాయిలలో వార్డులు, డివిజన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల పంపిణీ స్థానిక బలాబలాల ప్రాతిపదికన జరగనుంది. కానీ ఇక్కడే అసలు సమస్యలు వస్తాయని చర్చ నడుస్తుంది. ఎందుకంటే..స్థానికంగా జనసేన, టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. దీంతో స్థానికంగా వారిని బుజ్జగించడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఒకరికి సీటు ఇస్తే.. మరొక పార్టీ ఎన్నికల్లో మద్దతు ఇస్తారా లేదా అనేది తెలియదు. చాలా స్థానాలు ఇలాగే ఉండటంతో కూటమిలోని పార్టీకి పరీక్ష తప్పేలా లేదు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకులు అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపుపై ప్రాథమిక సమాలోచనలు నిర్వహించారు. టీడీపీ 65 శాతం, జనసేన 25, బీజేపీ 10 శాతంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. కానీ కొన్ని ముఖ్యమైన మున్సిపల్ స్థానాలపై జనసేన ప్రత్యేకంగా ఇంట్రస్ట్ చూపిస్తోంది. అందులో భాగంగానే విజయవాడ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు బలంగా నిలబడుతోంది. ఈ లెక్కల్లో భాగంగానే.. వంగవీటి రాధాను జనసేనలోకి తీసుకొచ్చారు. జనసేన నుంచి విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా బరిలో ఉంటారు. నిజానికి రాష్ట్ర రాజకీయాలు నడిచే విజయవాడ మేయర్ స్థానం కావడంతో దీనిపై ప్రత్యేకంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ప్రతీ గ్రామంలోనూ బలమైన క్యాడర్, యంత్రాంగం ఉండటంతో ఎక్కువ భాగం మేయర్, మున్సిపల్ ఛైర్మన్, జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
{{/usCountry}}తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ప్రతీ గ్రామంలోనూ బలమైన క్యాడర్, యంత్రాంగం ఉండటంతో ఎక్కువ భాగం మేయర్, మున్సిపల్ ఛైర్మన్, జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
{{/usCountry}}ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో జనసేనకు పట్టు ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన కార్పొరేషన్లలో కీలకమైన డివిజన్లలో జనసేన పోటీ పడనుంది.
భారతీయ జనతా పార్టీ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాయలసీమ పట్టణ ప్రాంతాల కార్పొరేషన్ వార్డులు, మున్సిపల్ సీట్లతో పాటు కొన్ని జిల్లాల్లో తమ ఉనికిని మరింత పెంచుకోవడానికి సీట్లను ఆశిస్తోంది. కానీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ 175 నియోజకవర్గాల్లో కాబట్టి అగ్రనేతలు పొత్తును సులువుగా అమలు చేయగలిగారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వేలాది వార్డులు, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు ఉండటం వల్ల కూటమి అభ్యర్థుల సర్దుబాటు సంక్లిష్టంగా మారనుంది.
పురపాలక, నగరపాలక సంస్థలలో కూటమి అభ్యర్థులను ఖరారు చేయడం ఎంతో కొంత సులువు కావచ్చు. పైస్థాని నేతలు రంగంలోకి దిగి.. సర్దిచెప్పి.. పోటీల్లో అభ్యర్థులను నిలబెడతారు. కానీ సర్పంచ్ ఎన్నికల కోసం అభ్యర్థుల విషయంలో కిందిస్థాయిలో ఇబ్బందులు రావొచ్చు. కూటమి భాగస్వామ్య పార్టీల నేతల మధ్య ఫ్రెండ్లీ కాంటెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కొన్ని కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల్లోనూ ఈ ఇబ్బంది తప్పకపోవచ్చు.
ఏళ్ల తరబడి స్థానికంగా పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు, వర్గాల మధ్య సీట్ల కేటాయింపు అసంతృప్తికి దారితీస్తే, అది ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారకుండా చూడాలని కూటమి పెద్దలు గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, అమరావతి నిర్మాణాలు, శాంతిభద్రతల అంశాలను కూటమి ప్రచారాంశాలుగా తీసుకెళ్తోంది.
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ద్వారా తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. గతంలో తమ ఆధీనంలో ఉన్న స్థానిక సంస్థల పీఠాలను నిలబెట్టుకోవడం ద్వారా తమ బలం తగ్గలేదని నిరూపించుకోవాలని వైసీపీ ఆశిస్తోంది. మొత్తానికి ఏపీలో స్థానిక పోరు అధికార కూటమి బలానికి, ప్రతిపక్ష పార్టీ బలం పుంజుకునేందుకు అత్యంత కీలకంగా మారనుంది. క్షేత్రస్థాయి ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
ఈ లింక్ క్లిక్ చేసి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ చూడండి.