ఏపీలో పీజీ చేరాలనుకుంటున్న విద్యార్థులకు అలర్ట్ వచ్చేసింది. ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. అంతేకాదు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో (PG Courses) ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.
ముఖ్యమైన తేదీలు…
ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన విద్యార్థులు… మార్చి 9వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక రూ.1000 అపరాధ రుసుముతో మార్చి 13 వరకు, రూ.2000 అపరాధ రుసుముతో మార్చి 16 వరకు, రూ.4000 అపరాధ రుసుముతో మార్చి 19వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.
ఇక రూ.10,000 అపరాధ రుసుముతో మార్చి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 5 నుంచి 11వ తేదీల మధ్య ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీ పీజీసెట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న 16 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఏపీ పీజీసెట్ 2026 కి సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మార్చి 24, 25 తేదీల్లో అందుబాటులోకి వస్తుంది. ఇక ఏప్రిల్ 21వ తేదీన హాల్ టికెట్లు విడుదలవుతాయి. ఏపీ పీజీసెట్ రాసేందుకు అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులతో పాటు సోషియాలజీ, తెలుగు, ఇంగ్లీష్ వాటి కోర్సుల్లో కూడా ప్రవేశాలు పొందొచ్చు
ఏపీ పీజీసెట్ - 2026 రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85% శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తారు. ఫలితాల విడుదల తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు.
ఏపీ పీజీసెట్ అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- హోం.పేజీలో కనిపించే స్టెప్ 3(ఫిల్ అప్లికేషన్) పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ విద్యా అర్హతలతో పాటు సంబంధిత పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఫొటో, సంతకం కూడా అవసరం.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.