రాష్ట్రంలోని రైతాంగానికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' పథకం కింద రెండవ విడత ఆర్థిక సహాయాన్ని శుక్రవారం విడుదల చేసింది. ఈ విడత ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,85,838 రైతు కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రూ.3,125.47 కోట్ల నిధులు జమవుతున్నాయి.

రైతులకు అందించిన ఈ మొత్తం రూ.3,125.47 కోట్ల నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన వాటాను భరించగా, కేంద్ర ప్రభుత్వం తన వంతు భాగస్వామ్యాన్ని అందించింది.
- రాష్ట్ర ప్రభుత్వ వాటా: రూ.2,342.92 కోట్లు
- కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ వాటా: రూ.782.55 కోట్లు
ఏటా రూ.20,000 సాయం
రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20,000 చొప్పున ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మొత్తం సాయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అందిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.6,000 సమకూరుస్తోంది. ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు.
- ఖరీఫ్ సీజన్ : రూ.7,000
- రబీ పంట కాలానికి: రూ.7,000
- వేసవి నిర్వహణ ఖర్చులకు : రూ.6,000
గత గణాంకాలను వివరిస్తూ…. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతులకు రూ.8,985.41 కోట్లను పంపిణీ చేసిందని మంత్రి తెలిపారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.3,125.47 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన రెండో విడత నిధులతో పాటు, 2024-25 కాలంలో పీఎం కిసాన్ కింద అందించిన నిధులను కూడా కలిపితే, ఇప్పటివరకు ఏపీలోని రైతులకు అందించిన మొత్తం ఆర్థిక సహాయం రూ.17,789.80 కోట్లకు చేరుకుందని వ్యవసాయ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చాయో రాలేదో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతు ఆధార్ నెంబర్‌తో స్టేటస్ చెక్ చేయవచ్చు. దీని ద్వారా ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలుస్తుంది. ఇక్కడ ఈకేవైసీ సమస్య ఉంటే… డబ్బులు జమ కావు. అప్పుడు వ్యవసాయశాఖ అధికారులను కలిసి తగిన పత్రాలను అందజేసి.. ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- ముందుగా https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోమ్‌పేజీలోని “Know Your Status” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. పక్కనే ఉన్న క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి.
- సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు వివరాలు డిస్ ప్లే అవుతాయి.
మనమిత్ర వాట్సాప్ లో ఇలా చెక్ చేసుకోవచ్చు:
- ముందుగా 9552300009 నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అనే మేసేజ్ చేయాలి.
- ఆ తర్వాత ఆప్షన్స్ డిస్ ప్లే అవుతాయి. ఇక్కడ అన్నదాత సుఖీభవ సేవను ఎంచుకోవాలి.
- ఇక్కడ్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ రైతు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- దీంతో రైతు వివరాలు కనిపిస్తాయి.