AP RTE Notification 2026 : పేద విద్యార్థులకు శుభవార్త - ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత అడ్మిషన్లు, అప్లికేషన్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి AP RTE 2026 నోటిఫికేషన్ విడుదలైంది. పేద విద్యార్థులకు ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయిస్తారు. దీని ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో మొదటి తరగతిలో ఉచితంగా సీటు పొందొచ్చు.
పేద విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్తను చెప్పింది. విద్యా హక్కు చట్టం(RTE) కింద 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఈ కోటా కింద సీట్ల కల్పిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రైవేట్, కార్పొరేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఆయా విద్యార్థులు మొదటి తరగతిలో ఉచితంగా ప్రవేశం పొందవచ్చు.
మొత్తం కేటాయించిన(25 శాతం ) సీట్లలో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఉంటాయి. ఎస్సీ విద్యార్థులకు 10 శాతం, ఎస్టీ 4 శాతం,.. బీసీ, మైనారిటీలు, ఇతరులకు 6 శాతం సీట్లు కేటాయిస్తారు. ఇక అనాథలు, దివ్యాంగులు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించారు.

అర్హతలు - ముఖ్యమైన వివరాలు…
- ఈ కోటా కింద దరఖాస్తు చేసుకునేందుకు కొన్ని అర్హతలు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థి వయసు జూన్ 1, 2026 నాటికి కనీసం 5 ఏళ్లు నిండి ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి వార్షిక ఆదాయం రూ.1.20 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో అయితే వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల లోపు ఉండాలి.
- సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సిలబస్ ను అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశం కోసం ఏప్రిల్ 2, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య జన్మించి ఉండాలి. 5 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
- స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న స్కూళ్లలో ప్రవేశం కోసం జూన్ 2, 2020 నుంచి మే 31, 2021 మధ్య జన్మించి 5 ఏళ్లు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం….
- ఈనెల 20వ తేదీన నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
- అర్హులైన అభ్యర్థులు http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- గ్రామ, వార్డు సచివాలయాలు, మండల విద్యా వనరుల కేంద్రం, సంబంధిత పాఠశాల నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు.
- మీ సేవా కేంద్రాల్లో ద్వారా కూడా దరఖాస్తు ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.
- దరఖాస్తకు చివరి తేదీ - 10 మార్చి 2026.
- ఈ అడ్మిషన్లకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 18004258599 టోల్‌ఫ్రీ నంబర్ కు కాల్ చేయవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఈ టోల్ ఫ్రీ నెంబర్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

