APPSC FSO Recruitment 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసంఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో శుభవార్త అందించింది. అటవీశాఖ సబార్డినేట్ సర్వీస్‌లో 26 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- దరఖాస్తుకు చివరి తేదీ - నవంబర్ 05, 2026 (రాత్రి 11:59 గంటల వరకు)
- దరఖాస్తు సవరణ - దరఖాస్తుల ముగింపు తేదీ తర్వాత 7 రోజుల పాటు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://portal-psc.ap.gov.in/

మొత్తం 26 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీలను జిల్లా క్యాడర్ పోస్టులుగా భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32,670 నుండి రూ.1,01,970 వరకు వేతన శ్రేణి అందుతుంది.
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బోటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ లేదా అగ్రికల్చర్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా కెమికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో బి.టెక్/బి.ఇ డిగ్రీ కలిగి ఉండాలి.
జూలై 01, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లకు సర్వీసు ఆధారంగా వయోసడలింపు ఉంటుంది.
దేహదార్ఢ్య అర్హతలు - శారీరక పరీక్షలు:
- పురుషులు : ఎత్తు కనీసం 163 సెం.మీ, ఛాతీ సాధారణ స్థితిలో 84 సెం.మీ (కనీసం 5 సెం.మీ విస్తరణ) ఉండాలి.
- మహిళలు : ఎత్తు కనీసం 150 సెం.మీ, ఛాతీ సాధారణ స్థితిలో 79 సెం.మీ (కనీసం 5 సెం.మీ విస్తరణ) ఉండాలి. (ఎస్టీ, గుర్ఖా మొదలైన వర్గాలకు ఎత్తులో సడలింపు ఉంటుంది).
- వాకింగ్ టెస్ట్ : రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో వాకింగ్ టెస్ట్‌కు పిలుస్తారు. పురుషులు 4 గంటల్లో 25 కిలోమీటర్లు, మహిళలు 4 గంటల్లో 16 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
- ఎన్సీసీ బోనస్ మార్కులు: ఎన్సీసీ 'C' సర్టిఫికేట్ ఉన్నవారికి 5 మార్కులు, 'B' సర్టిఫికేట్కు 3 మార్కులు, 'A' సర్టిఫికేట్కు 1 మార్కు బోనస్‌గా ఇస్తారు.
ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) లో సాధించిన మార్కులు, వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ మరియు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) అర్హతల ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి.రాత పరీక్షలో ప్రతీ తప్పు సమాధానానికి 1/3 వంతు నెగిటివ్ మార్కులు ఉంటాయి.
{{/usCountry}}అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) లో సాధించిన మార్కులు, వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ మరియు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) అర్హతల ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి.రాత పరీక్షలో ప్రతీ తప్పు సమాధానానికి 1/3 వంతు నెగిటివ్ మార్కులు ఉంటాయి.
{{/usCountry}}అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 250, పరీక్ష ఫీజు రూ. 80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు తెల్ల రేషన్ కార్డు కలిగిన నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు (రూ. 80) నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మొదట ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ( https://psc.ap.gov.in ) లో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత సైట్లో లాగిన్ అయి పోస్ట్ నోటిఫికేషన్ ఎంచుకుని, ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి. చివరగా ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని తీసుకోవాలి.