ఏపీఆర్‌సీఈటీ ర్యాంక్ కార్డులు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

ఏపీఆర్‌సీఈటీ ర్యాంక్ కార్డులు విడుదల అయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Feb 26, 2026, 06:14:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీఆర్‌సీఈటీ 2024-25కి సంబంధించి ర్యాంక్ కార్డులు విడుదల అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(APSCHE) ఛైర్‌పర్సన్ కె.మధు మూర్తి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వి.ఉమ ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET) 2024-25 ర్యాంక్ కార్డులను విడుదల చేశారు.

ఏపీఆర్‌సీఈటీ ర్యాంక్ కార్డులు విడుదల
ఏపీఆర్‌సీఈటీ ర్యాంక్ కార్డులు విడుదల

APRCET కన్వీనర్ ఆర్.ఉష, సహ-కన్వీనర్ జాన్ సుష్మ మాట్లాడుతూ, అభ్యర్థుల పూర్తి వివరాలను కౌన్సిల్ అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/RCETలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఏపీఆర్‌సీఈటీ పరీక్షకు హాజరయ్యారు. దీనిద్వారా పీహెచ్‌డీ కోర్సులకు అడ్మిషన్ దొరుకుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా.. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు ప్రవేశం ఉంటుంది. పరీక్షలు 03-11-2025 నుంచి 07-11-2025 వరకు పరీక్షలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరిగాయి.

ఏపీఆర్‌సీఈటీ దరఖాస్తుకు అభ్యర్థులు పీజీలో కనీసం 55 శాతం మార్కులు సాధించాలి. ఫుల్-టైమ్ PhD కోర్సులకు మాస్టర్స్ డిగ్రీ హోల్డర్లు, ఇంటిగ్రేటెడ్ PhD ప్రోగ్రామ్‌లకు B.Tech/B.Pharm (55 శాతం మార్కులతో) ఉన్నవారు అర్హత కలిగి ఉంటారు. రిజిస్టర్డ్ ఉద్యోగులు ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఏపీఆర్‌సీఈటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్‌లో జరిగింది. మొత్తం 140 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. 60 మార్కులు ఇంటర్వ్యూ ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. పార్ట్ ఏలో టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ (70 మార్కులు) – రీసెర్చ్ మెథడాలజీ, టీచింగ్ స్కిల్స్. పార్ట్ బీలో సబ్జెక్ట్ స్పెసిఫిక్ (70 మార్కులు)- మాస్టర్స్ సబ్జెక్ట్ ఆధారంగా నిర్వహించారు.

ఈ లింక్ క్లిక్ చేసి ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More