విద్యార్థులకు కీలక అప్డేట్.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మే 12 నుంచి ఏపీ ఈఏపీ సెట్

ఏపీ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.

Published on: Dec 23, 2025, 11:52:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీలో 2026-27 విద్యా సంవత్సరంలో నిర్వహించే పలు యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదలైంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి(APSCHE) వెల్లడించింది. ఉన్నత విద్యా మండలి బీటెక్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాల కోసం AP EAPCET 2026 పరీక్ష తేదీని విడుదల చేసింది. ఈ పరీక్ష మే 12 నుండి 20 వరకు నిర్వహిస్తారు.

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

AP EAPCET 2026 పరీక్ష ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి, చివరి తేదీలోపు పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు ఫారాలను పూరించాలి. అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే AP EAPCET 2026 పరీక్షకు నమోదు చేసుకొని, పరీక్షకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారాలను పూరించే ముందు పరీక్షల వివరణాత్మక షెడ్యూల్, పరీక్షా విధానాలను గమనించాలి

ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష: మే 12, 13, 14, 15, 18

ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష: మే 19, 20

ఏపీ ఈసెట్‌ - ఏప్రిల్‌ 23న రెండు సెషన్స్

ఏపీ ఐసెట్‌ - ఏప్రిల్‌ 28న రెండు సెషన్స్

ఏపీ పీజీఈసెట్‌ - ఏప్రిల్‌ 29, 30, మే 2 తేదీల్లో ఆరు సెషన్స్

ఏపీ పీజీసెట్‌ - మే 5, 8, 9, 10, 11 10 సెషన్స్

ఏపీ లాసెట్‌ - మే 4 ఒక సెషన్‌

ఏపీ ఎడ్‌సెట్‌ - మే 4 ఒక సెషన్‌

ఈఏపీ సెట్ అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్యా బోర్డు నుండి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 12వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 12వ తరగతి పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా ఏపీ ఈఏపీసెట్ 2026 ఇంజనీరింగ్ పరీక్షలో పాల్గొనడానికి అర్హులు. ఇంజనీరింగ్‌లో డిప్లొమా పరీక్షలో ఉత్తీర్ణులైన లేదా చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు కూడా ఏపీ ఈఏపీసెట్ 2026 పరీక్షలో పాల్గొనడానికి అర్హులు. ఈఏపీసెట్ ఫార్మసీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా మ్యాథమెటిక్స్‌తో 10+2 పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More