AP Weather Updates : రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో వాతావరణం మరింత చల్లబడనుంది. పలు చోట్ల విభిన్నమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం… దక్షిణ కోస్తాంధ్ర మరియు దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి నిర్దిష్ట ఎత్తులో ఒక బలమైన ఉపరితల ఆవర్తనం (Cyclonic Circulation) కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఈ జిల్లాలకు వర్ష సూచన…

ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా శనివారం(జూన్ 13) నాడు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు రానున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ పరిధిలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు తీవ్రమైన పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వీటితో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో సైతం అక్కడక్కడా ఆకాశం మేఘావృతమై ఉండి, పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు పడే వీలుంది. ఈ వర్షాల సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
వాతావరణం వేగంగా మారుతున్నందున కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, అలాగే పశువుల కాపరులు బయట ఉండకూడదని తెలిపింది.
పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద, పాతపడిపోయిన షెడ్ల కింద ఆశ్రయం పొందకూడదని హెచ్చరించింది. ఈదురుగాలుల వల్ల హోర్డింగులు, బలహీనమైన కట్టడాలు కూలిపోయే అవకాశం ఉన్నందున… ప్రయాణాల్లో ఉన్నవారు సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని వివరించింది.
{{/usCountry}}పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద, పాతపడిపోయిన షెడ్ల కింద ఆశ్రయం పొందకూడదని హెచ్చరించింది. ఈదురుగాలుల వల్ల హోర్డింగులు, బలహీనమైన కట్టడాలు కూలిపోయే అవకాశం ఉన్నందున… ప్రయాణాల్లో ఉన్నవారు సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని వివరించింది.
{{/usCountry}}