పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ సర్వీసులతో పాటు అదనంగా వివిధ నగరాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సులపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంటారు. అయితే ఈసారి ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం పడకుండా సాధారణ ఛార్జీలకే ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ నుంచి చాలా బస్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నగరం నుంచి ఏపీలోని వివిధ పట్టణాలకు అనేక బస్సులను కేటాయించారు.
హైదరాబాద్ నుంచి ఏపీకి
విజయవాడ: 1 డాల్ఫిన్ క్రూయిజ్, 11 సూపర్ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్
మచిలీపట్నం: 1 నైట్ రైడర్, 2 ఇంద్ర, 1 సూపర్ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్
ఏలూరు: 2 ఇంద్ర, 2 సూపర్ లగ్జరీ, 3 అల్ట్రా డీలక్స్
అమలాపురం: 1 ఇంద్ర, 2 సూపర్ లగ్జరీ
జంగారెడ్డిగూడెం: 1 ఇంద్ర, 1 సూపర్ లగ్జరీ
తిరువూరు: 1 సూపర్ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్
గుడివాడ: 1 సూపర్ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్
పొన్నూరు: 1 ఇంద్ర, 1 సూపర్ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్
తెనాలి: 1 ఇంద్ర, 1 సూపర్ లగ్జరీ
విశాఖపట్నం: 1 సూపర్ లగ్జరీ
కాకినాడ: 1 సూపర్ లగ్జరీ
{{/usCountry}}కాకినాడ: 1 సూపర్ లగ్జరీ
{{/usCountry}}ఎలేశ్వరం: 1 అల్ట్రా డీలక్స్
రావులపాలెం: 1 సూపర్ లగ్జరీ
భీమవరం: 1 అల్ట్రా డీలక్స్
నరసాపురం: 1 సూపర్ లగ్జరీ
తణుకు: 1 సూపర్ లగ్జరీ
నూజివీడు: 2 అల్ట్రా డీలక్స్
పెనుగంచిప్రోలు: 1 సూపర్ లగ్జరీ
గన్నవరం: 1 సూపర్ లగ్జరీ
అవనిగడ్డ: 3 సూపర్ లగ్జరీ
ఉయ్యూరు: 1 ఎక్స్‌ప్రెస్
గుంటూరు: 2 సూపర్ లగ్జరీ
చిలకలూరిపేట: 1 సూపర్ లగ్జరీ
నరసరావుపేట: 1 అల్ట్రా డీలక్స్
మాచర్ల: 1 సూపర్ లగ్జరీ
నెల్లూరు: 1 సూపర్ లగ్జరీ
ప్రొద్దుటూరు: 2 సూపర్ లగ్జరీ
ఆళ్లగడ్డ: 1 ఎక్స్‌ప్రెస్
నంద్యాల: 1 ఎక్స్‌ప్రెస్
ఆత్మకూరు (కె): 1 సూపర్ లగ్జరీ
బెంగళూరు నుంచి బస్సుల వివరాలు
బెంగళూరు నుంచి రాయలసీమ, ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను కేటాయించింది.
తిరుపతి: 3 సూపర్ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్, 7 సప్తగిరి ఎక్స్‌ప్రెస్, 2 ఎక్స్‌ప్రెస్
ప్రొద్దుటూరు: 1 సూపర్ లగ్జరీ, 4 అల్ట్రా డీలక్స్
కర్నూలు: 3 సూపర్ లగ్జరీ, 1 అల్ట్రా డీలక్స్
కడప: 1 సూపర్ లగ్జరీ, 3 అల్ట్రా డీలక్స్
తాడిపత్రి: 1 అల్ట్రా డీలక్స్
ఉరవకొండ: 1 ఎక్స్‌ప్రెస్
బద్వేలు: 1 సూపర్ లగ్జరీ
కదిరి: 2 ఎక్స్‌ప్రెస్
నెల్లూరు: 2 సూపర్ లగ్జరీ
గుంటూరు: 1 సూపర్ లగ్జరీ
చెన్నై నుంచి సర్వీసులు
విజయవాడ: 2 సూపర్ లగ్జరీ బస్సులు
గుంటూరు: 1 సూపర్ లగ్జరీ బస్సు
ఈ ప్రత్యేక సర్వీసులన్నింటికీ ముందస్తు సీట్ల రిజర్వేషన్ సదుపాయం ఉంటుంది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా APSRTC అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా తమ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు సూచించారు. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి గురికాకుండా సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు. సాధారణ ఛార్జీలకే ప్రయాణించవచ్చని అధికారులు అంటున్నారు.