ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆర్థిక, రవాణా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక బెంగళూరు-విజయవాడ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ప్రాజెక్టును శరవేగంగా ముందుకు తీసుకెళ్తోంది. భారత్‌మాల పరియోజనా ఫేజ్-2 కింద రూపుదిద్దుకుంటున్న ఈ 6 లైన్ల ప్రాజెక్ట్… యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా అందుబాటులోకి రానుంది. కొత్తగా నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారితో పాటు ప్రస్తుతం ఉన్న పలు కీలక రహదారులను ఆధునీకరిస్తూ ఈ విస్తృత కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వర్గాలు వెల్లడించాయి.
తగ్గనున్న జర్నీ టైమ్…..

ప్రస్తుతం బెంగళూరు నుంచి విజయవాడ చేరుకోవడానికి సుమారు 11 నుంచి 12 గంటల సమయం పడుతోంది. అయితే ఈ నూతన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గి, కేవలం 6 నుంచి 7 గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే సాధారణ ప్రయాణికులకు ప్రయాణం సులభతరం కావడమే కాకుండా, రెండు నగరాల మధ్య సరుకు రవాణా విపరీతంగా వేగవంతమవుతుంది.
రూట్ మ్యాప్, ప్రాజెక్టు అంచనా వ్యయం ఇలా….
ఈ ప్రాజెక్టులో భాగమైన నూతన గ్రీన్ ఫీల్డ్ రహదారి విభాగం మొత్తం 342 నుంచి 343 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని కోడికొండ వద్ద ప్రారంభమై అద్దంకి సమీపంలోని ముప్పవరం వరకు సాగుతుంది. ఇక పాత రహదారుల విస్తరణ, ఆధునీకరణలను కూడా కలిపితే ఈ మొత్తం కారిడార్ పొడవు 518 కిలోమీటర్ల నుంచి 624 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 19,200 కోట్ల నుంచి రూ. 19,320 కోట్ల వరకు వ్యయం కానుందని అంచనా వేశారు.
ఈ ప్రధాన రహదారి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కర్నూల్, కడప జిల్లాల గుండా వెళ్తుంది. రద్దీగా ఉండే పట్టణాలు, పాత జాతీయ రహదారులకు బైపాస్‌గా ఈ అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఫలితంగా పాత రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఈ కారిడార్ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలు, పారిశ్రామిక వస్తువులను బెంగళూరు, విజయవాడ మార్కెట్లతో పాటు తూర్పు తీరంలో ఉన్న వివిధ ఓడరేవులకు (పోర్టులకు) వేగంగా రవాణా చేయడానికి మార్గం సుగమమవుతుంది.
ప్రకాశం జిల్లా పరిధిలో 110 కిలోమీటర్లు…..
{{/usCountry}}ఈ ప్రధాన రహదారి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, కర్నూల్, కడప జిల్లాల గుండా వెళ్తుంది. రద్దీగా ఉండే పట్టణాలు, పాత జాతీయ రహదారులకు బైపాస్‌గా ఈ అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఫలితంగా పాత రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఈ కారిడార్ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలు, పారిశ్రామిక వస్తువులను బెంగళూరు, విజయవాడ మార్కెట్లతో పాటు తూర్పు తీరంలో ఉన్న వివిధ ఓడరేవులకు (పోర్టులకు) వేగంగా రవాణా చేయడానికి మార్గం సుగమమవుతుంది.
ప్రకాశం జిల్లా పరిధిలో 110 కిలోమీటర్లు…..
{{/usCountry}}ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గుండా అత్యధికంగా దాదాపు 110 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. జిల్లాలోని చంద్రశేఖరపురం, కనిగిరి, వెలిగండ్ల, మర్రిపూడి, చీమకుర్తి, తాళ్లూరు, అద్దంకి, కొండపి, పంగులూరు వంటి పలు మండలాల మీదుగా ఈ రోడ్డు సాగుతుంది. కనిగిరి, పొదిలి వంటి ప్రధాన పట్టణాలు కూడా ఈ కారిడార్ పరిధిలోనే రానున్నాయి.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో భూమి సిద్ధం చేయడం, కల్వర్టులు, వంతెనల నిర్మాణం, తార్ రోడ్డు (బ్లాక్‌టాప్) వేసే పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రత్యేకించి నారాయణంపేట-చంద్రశేఖరపురం మరియు పోలవరం-మర్రిపాడు మార్గాల్లో పనులు గణనీయమైన పురోగతి సాధించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే స్థానిక ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి.
ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను మొత్తం 14 ప్యాకేజీలుగా విభజించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలైన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL), కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్, దిలీప్ బ్యూల్డ్‌కాన్‌లు ఈ కాంట్రాక్టులను దక్కించుకుని పనులు వేగవంతం చేశాయి. భారీ ఎత్తున మట్టి తరలింపు, ఎంబ్యాంక్‌మెంట్ల నిర్మాణం, తార్ రోడ్ల నిర్మాణం అన్ని ప్యాకేజీల్లోనూ ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇటీవల జనవరి 2026లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. విస్తృత బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్‌ను 2027 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
మరోవైపు…. ఈ నూతన ఎక్స్‌ప్రెస్ వేకు అనుసంధానతను పెంచేందుకు NHAI మరో కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని దేవునహళ్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కోడికొండ వరకు ఉన్న 90 కిలోమీటర్ల జాతీయ రహదారి 44 (NH-44)ను విస్తరించి అభివృద్ధి చేయడానికి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను సిద్ధం చేస్తోంది.