...
...
Next Story

చైల్డ్ ట్యాగ్‌లు పంపిణీ చేయాలి.. తిరుమల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష

అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. భక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని చెప్పారు.

Published on: Aug 7, 2026, 11:56:21 IST
Advertisement

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ జేఈవో డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి వివిధ శాఖల ఏర్పాట్లపై వెంకయ్య చౌదరి సమగ్రంగా సమీక్షించారు.

బ్రహ్మోత్సవాలపై సమీక్ష
బ్రహ్మోత్సవాలపై సమీక్ష

ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచాలని సూచించారు. వాహనాల పార్కింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పార్కింగ్ స్థలాలను కేటాయించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు.

చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్‌ల పంపిణీని విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ కేబుళ్లు, తాత్కాలిక విద్యుత్ వ్యవస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

ముఖ్యంగా గరుడ వాహనం, చక్రస్నానం రోజున అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదేవిధంగా అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను వెంకయ్య చౌదరి ఆదేశించారు.

అనంతరం తిరుపతి జేఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలతో పాటు సింగపూర్, జర్మనీ నుండి కూడా కళా బృందాలు విచ్చేసేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe